స్మరణ : నారమల్లి శివప్రసాద్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, 1951 జూన్ 10వ తేదీన చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఇండస్ట్రీ లోకి రావాలనే ఆలోచనతోనే మొదట 1983 లో వచ్చిన ఖైదీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత 1988 సంవత్సరంలో యముడికి మొగుడు, 1990లో మాస్టర్ కాపురం, 1993లో మేడం, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్, జై చిరంజీవ ,లక్ష్మి, కితకితలు, ఒక్కమగాడు, తులసి, ఆటాడిస్తా, బలాదూర్, పిల్లజమీందార్, సాఫ్ట్వేర్ సుదీర్ , సప్తగిరి ఎల్ ఎల్ బి, సయ్యాట వంటి ఎన్నో చిత్రాలలో నటించి తన కంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసిన ఈయన, హీరోలకు అలాగే కమెడియన్ లకు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఉన్నట్లు గానే ఆయన రాజకీయాల పై మక్కువతో టిడిపి తరఫున పోటీ చేసి , గెలవడం కూడా జరిగింది. ఇటు సినీ పరంగా మంచి గుర్తింపు పొందిన నారమల్లి శివప్రసాద్ 2019 సెప్టెంబర్ 21వ తేదీన చెన్నైలో కన్నుమూయడం జరిగింది. ఇక ఈయన లేని లోటు అటు రాజకీయాల్లోనూ ఇటు సినీ ఇండస్ట్రీలోని పూడ్చలేనిది అని పలువురు ప్రముఖులు కూడా అప్పట్లో తమ అభిప్రాయాలను వెల్లడించారు.