రేవంత్ 'చంద్ర' మాటలు.. కాంగ్రెస్‌కు కీడు చేస్తాయా?
అయితే అదే తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడు మోడీని ఈ విషయంలో విమర్శిస్తున్నారు వీళ్ళు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం పైన కేంద్ర అధికారాన్ని కలిగి ఉంటుంది. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేస్తే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోదు, ఎందుకు చంద్రబాబు నాయుడుని బయటికి రానివ్వదు అంటూ మోడీని విమర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు.
అయితే కేటీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్టు అనేది రెండు పార్టీలకు మధ్యన నలుగుతున్న విషయం అని, దానికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏముందని, తమకు ఈ విషయంలో ఏమీ సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే అదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి కేటీఆర్ చేసినటువంటి తాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
ఎందుకంటే ఎంత కాదన్నా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు. తమ లాంటి నాయకులందరికీ హెడ్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం ఒకరకంగా ఆయనకు నచ్చడం లేదు. గతంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును కలిగి ఉన్నాయి. ఆ సందర్భంలో ఎవరూ కూడా కేటీఆర్ లా వ్యాఖ్యానించ లేదు కదా అన్నారు రేవంత్. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో స్పందించింది తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ, అలాగే కాంగ్రెస్ మాత్రమే.