చంద్రబాబును.. సొంత లాయర్లే ముంచుతున్నారా?

Chakravarthi Kalyan
చంద్రబాబు చేత శెభాష్ అనిపించుకోవడానికో.. లేక టీడీపీ శ్రేణుల్లో వీరులు అనిపించుకోవడానికో.. లేదా చంద్రబాబు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం అని చెప్పడానికో.. ఎవరికీ తెలియంది మాకే తెలుసు అనుకుంటున్నారో తెలియడం లేదు కానీ చంద్రబాబు విషయంలో లాయర్లు వ్యవహరిస్తున్న తీరు ఆయన్నే ఇబ్బంది పెడుతోంది. చంద్రబాబుని తొలిసారి నంద్యాల దగ్గర సీఐడీ అధికారులు అరెస్టు చేసి తీసుకువచ్చారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో విచారిస్తున్నారు. విచారిస్తుండగానే రాత్రి సమయంలో జడ్జి గారి తలుపుకొట్టి బెయిల్ కావాలని అడిగారు. సాధారణంగా కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత బెయిల్ కావాలని కోరతారు. ఆయన కు రిమాండ్ విధించగానే బెయిల్ పిటిషన్ దాఖలు మానేసి కేసు నే కొట్టేయాలని కోరారు. ఆ సమయంలో వీళ్లు ఆలోచించింది ఏంటంటే బెయిల్ అయితే నేరాన్ని ఒప్పుకున్నట్లే.. అదే కేసు కొట్టేస్తే ఏ తప్పు చేయని వారవుతారు అని. అలా చెప్తూనే మరో వైపు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.

చంద్రబాబు లాయర్లు వెంటనే కస్టడీ బెయిల్ దాఖలు చేస్తే ఏం జరిగేదో… కానీ వీళ్లు కస్టడీ ఆపించారు. దీనివల్ల ఆయన కొన్ని రోజుల పాటు జైలు లోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ ఆరంభంలో వేయలేదు. కేసు విచారణలో ఉండగా పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల పోలీసు కస్టడీ తర్వాత చంద్రబాబుని జడ్జి ముందు వర్చువల్ గా ప్రవేశపెట్టారు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా.. అని ఈ సందర్భంగా జడ్జి అడిగారు. ఏమీ లేదని ఆయన బదులిచ్చారు. ఈ సమయంలో లాయర్లు జోక్యం చేసుకొని ఇలా కస్టడీకి  ఇవ్వడమే తప్పు వాదించారు. ఈ విషయంపైనే గతంలో హైకోర్టుకు వెళ్లినా వాళ్లు పక్కన పెట్టారు. మళ్లీ దీనిపై చర్చకు తెరలేపారు. దీని వల్ల జ్యూడిషియల్ కు విసుగు తెప్పించినట్లు అవుతుంది. దీని వల్ల వచ్చే సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

LAW

సంబంధిత వార్తలు: