ఐటీ నోటీసులపై బాబు మౌనం.. అంగీకారమేనా?
డిటైల్డ్ పాయింట్ ప్రకారం.. షాపూర్ జీ పల్లంజీ కి సంబంధించి అమౌంట్ పెయిడ్ ఔట్.. రూ. 18. 93 కోట్లు, 2019 లో ఇచ్చినట్లు ఉంది. హయాగ్రీవలో రెండోది 11 కోట్లకు పైగా 2020 లో ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడోది ఎవరెట్ అండ్ నవోలిన్ విక్కీ మొబైల్ దీనికి సంబంధించి రూ.50 కోట్లు 2021 లో ఇచ్చినట్లు ఎల్ అండ్ టీకి ఇచ్చినవి అయితే లెక్కనే లేదు. పోర్ ట్రేడింగ్ లో రూ. 9 కోట్లకు పైగా, పోనెక్స్ లో రూ.18 కోట్లు, అండ్ వ్రిటన్ షీట్ లుక్ స్టోన్ అండ్ కోక్ రూ. 10.23 కోట్లు, పేమేంట్ ఇన్స్ దుబాయి రూ.15. కోట్లకు పైగా 2021 లో ఇచ్చినట్లు మొత్తం కలిపి రూ. 180 కోట్లకు పైగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది దొండపాటి వెంకటేశ్ హరీష్ సెంట్రల్ సర్కిల్ 2 హైదరాబాద్ నుంచి రిపోర్టుగా సమాచారం. అయితే దీనిపై చంద్రబాబు ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. చంద్రబాబు ఇప్పడు బీజేపీపై దీన్ని తోసేస్తారా.. లేదా వైసీపీ ఆడుతున్న నాటకం అని చెబుతారా అనేది చూడాలి. మరి చంద్ర బాబు చెప్పాల్సిన సమాధానం కోసం అందరూ వేచి చూస్తున్నారు. అసలు ఐటీ శాఖ వారు ఇప్పుడు ఇలాంటి నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏమిటి ఎందుకు ఇచ్చారు. తదితర వివరాలు చంద్రబాబు నోరు తెరిస్తేనే విషయాలు బయట కొస్తాయి.