తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పట్టుకుని లోకేష్ ఊగులాడుతున్నారు. వివేకా హత్యపేరుతో బుధవారం తిరుపతిలో పెద్ద క్యామిడినే చేశారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో ప్రచారం చేసిన లోకేష్ తన మద్దతుదారులతో ఉదయం 11 గంటల ప్రాంతంలో అలిపిరికి చేరుకున్నారు. పార్టీ నేతలతో కాసేపు హంగామా చేసిన లోకేష్ అలిపిరిలో శ్రీవారి పాదల సాక్షిగా వివేకానందరెడ్డి హత్యకేసుతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదంటు ప్రమాణం చేశారు. ప్రమాణం చేసే విషయంలో తన సవాలుకు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు కాబట్టి వివేకా హత్యతో జగన్ కుటుంబానికి సంబంధం ఉన్నట్లే అని ఒకదెబ్బకు తేల్చేశారు.
ఇంతకాలం సీబీఐ దర్యాప్తులో తేలని అంశాన్ని లోకేష్ ఒకే నిముషంలో తేల్చేశారు. బాబాయ్ హత్య ఘటనలో తన కుటుంబం ప్రమేయం ఉంది కాబట్టే జగన్ తన సవాలును స్వీకరించకపోవటమే కాకుండా అలిపిరి దగ్గర ప్రమాణం చేయటానికి కూడా రాలేదన్నారు. అంటే లోకేష్ ఆలోచన ఎలాగుందుంటే తాను జగన్ ఇద్దరం సమానస్ధాయి నేతలమే అన్నట్లుగా ఉంది. తనస్ధాయిని తాను లోకేష్ చాలా ఎక్కువగా ఊహించుకోవటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆ విషయాన్ని లోకేష్ గ్రహించుకోవటంలేదు. ఇదే సమయంలో తనకు చెప్పే నేతలు కూడా ఎవరు లేరు. అందుకనే నోటికొచ్చింది లోకేష్ మాట్లాడేస్తుంటారు.
సవాళ్ళు, ప్రమాణాల సంగతిని పక్కన పెట్టేస్తే లోకేష్ కు అర్ధంకాని విషయం ఒకటుంది. అదేమిటంటే వివేకానందరెడ్డి హత్యకేసుకు తిరుపతి జనాలకు ఏమాత్రం సంబంధం లేదని. తిరుపతిలో వివేకా గురించి తెలిసింది చాలా తక్కువమందికే. అదికూడా దివంగత సీఎం వైఎస్సార్ తమ్ముడిగా మాత్రమే తెలుసు. ఎందుకంటే వివేకానందరెడ్డికంటూ ప్రత్యేకమైన ఐడెంటి ఎప్పుడూ లేదు. తిరుపతిలోనే వివేకా గురించి చాలామందికి తెలియదంటే ఇక మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసలు పట్టించుకునే వాళ్ళేలేరు. ఇలాంటి పనికిమాలిన అంశాన్ని పట్టుకుని లోకేష్ రోజుల తరబడి జీడిపాకం లాగ పట్టుకుని ఊగులాడుతున్నారు. జనాలకు పట్టని ఇలాంటి అంశాలను పట్టుకుని ఊగుతున్నారు కాబట్టే లోకేష్ ను అందరు మందలగిరి మాలోకం అంటున్నది.