అఖండ2 సినిమాకు ఈ డైలాగ్స్ హైలెట్.. నెక్స్ట్ లెవెల్ లో సీన్స్ ఉన్నాయిగా!
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎప్పుడూ భారీ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. అయితే, ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రాలలో కేవలం వీరోచితమైన పోరాటాలే కాకుండా, అంతర్లీనంగా బలంగా ఉండే ఎమోషన్స్ కూడా కీలకంగా నిలుస్తాయి.
తల్లి చనిపోయిందంటూ ఓ చిన్నారి చెప్పే మాటలు, దానికి ప్రతిగా హీరో పలికే సంభాషణలు కేవలం సినిమాటిక్ డైలాగులు మాత్రమే కాదు, అవి లోతైన హ్యూమన్ ఎమోషన్స్ ను , తల్లి పట్ల ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే అపురూపమైన అనుబంధాన్ని ఆవిష్కరించాయి. "తల్లి చనిపోయిందని పాప చెపుతున్నప్పుడు నీకెలాంటి బంధాలు లేకపోయినా ఆమెకు ఆ బంధం ఉంటుంది కదా..." అనే డైలాగ్, ఆహీరోకి వ్యక్తిగతంగా బంధాలు లేకపోవచ్చు, కానీ ఆ చిన్నారికి, ప్రతి మనిషికి 'తల్లి'తో ఉండేది అత్యంత పవిత్రమైన బంధం అనే సత్యాన్ని బలంగా చెబుతుంది. ఇది ప్రేక్షకులందరినీ తమ వ్యక్తిగత అనుబంధాలలోకి లాగి, కంటతడి పెట్టిస్తుంది.
అంతేకాకుండా, "జనం చస్తున్నా నీ దేవుడు రాడు.. తల్లి చనిపోయినా నువ్వు రావు.. అసలు నీకు, నీ దేవుడికి మనసు అనేది ఉందా ?" అనే డైలాగ్ వ్యవస్థలోని వైఫల్యాలపై, నిస్సహాయతపై ఆగ్రహాన్ని అభిప్రాయాన్ని తెలియజేస్తాయి. కష్టం వచ్చినప్పుడు, ముఖ్యంగా తల్లి దూరం అయినప్పుడు, ఆ బాధను తీర్చడానికి దైవం కూడా రాదనే నిజాన్ని నిర్భయంగా ప్రశ్నిస్తాయి. ఈ డైలాగులు కేవలం ఒక పాత్ర కోపాన్ని మాత్రమే కాదు, నిస్సత్తువలో ఉన్న ప్రతి మనిషి హృదయంలో కలిగే ఆవేదనను ప్రతిధ్వనిస్తాయి.
బోయపాటి శ్రీను మార్కు పవర్‌తో కూడిన ఈ డైలాగులను బాలకృష్ణ తనదైన అద్భుతమైన అభినయంతో పలకడం వలన, ఆ ఎమోషన్ మరింత బాగా తెరపై కనిపించనుంది. వెండితెరపై ఆ కోపాన్ని, ఆ ఆవేదనను చూస్తున్న ప్రతి ఒక్కరికీ గుండె బరువెక్కి, తమ తల్లిని తలచుకుని మనసు కదిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సన్నివేశం తల్లి బంధం యొక్క గొప్పతనాన్ని, ఆ బంధం లేని లోటు కలిగించే బాధను అత్యంత అద్భుతంగా తెరపై చూపించింది.