హెరాల్డ్ సెటైర్: టీడీపీని వదిలేసిన వాళ్లకు బాబు ఫోన్లు...?

Gullapally Venkatesh
తెలుగుదేశం పార్టీలో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో చాలా మంది నాయకులు పార్టీలో ఉండే అవకాశం లేదు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా మూడు జిల్లాల మీద చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడు జిల్లాలకు సంబంధించి కీలక నాయకత్వాన్ని ఆయన బరిలోకి దింపే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది.

 ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన కొంతమంది కీలక నేతల విషయంలో చంద్రబాబు నాయుడు చాలా సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే తనతో సన్నిహితంగా ఉండే కొంతమంది కీలక నేతలకు ఆయన ఫోన్ కూడా చేశారని రాజకీయవర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత లేకపోయినా దాదాపుగా తెలుగుదేశం పార్టీలోకి కొంత మంది నేతలను ఆహ్వానించే ఆలోచనలో ఆయన ఉన్నారని వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో తెలంగాణలో కలిసి ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కాబట్టి పార్టీలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.

కచ్చితంగా బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బలహీనపడుతుందని చంద్రబాబు నాయుడు కొంతమంది నేతలకు చెప్తున్నారు అని సమాచారం. అందుకే ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు పార్టీలోకి తిరిగి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుని కూడా చంద్రబాబు నాయుడు మార్చే అవకాశం ఉందని సమాచారం. నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ఇప్పుడు బిజెపికి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సహకారం అందించడానికి సిద్ధం అవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుని మార్చడానికి రంగం సిద్ధం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: