హెరాల్డ్ సెటైర్: రాహుల్ ఇంత తెగించారు ఏంటీ...?

Gullapally Venkatesh
దేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని ఇబ్బంది పెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా వెనకబడి ఉంది అనే భావన ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాల కారణంగా పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడుతుందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలను సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటివరకు కూడా ఈ నిర్ణయం రాహుల్ గాంధీ తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు భారతీయ జనతా పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంపై రాహుల్ గాంధీ కూడా కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు దేశంలో కొన్ని ప్రాంతాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

ఉప ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏంటి అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. వాటి తర్వాత రాహుల్ చేసే కొన్ని మార్పులు కఠినంగా ఉండే అవకాశాలు ఉండవచ్చు అనే భావన వ్యక్తమవుతోంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది వెంటనే తెలియదు గానీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో 14 మంది సీనియర్ నేతలను సస్పెండ్ చేసే అవకాశాలు ఉండవచ్చు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ఢిల్లీకి చెందిన ముగ్గురు... అలాగే జమ్మూకాశ్మీర్ కు చెందిన ఒక నేత అలాగే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముగ్గురు నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: