హెరాల్డ్ సెటైర్ : బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు నోరెత్తకూడదట ​

Vijaya
అవును పార్టీలో జరుగుతున్నదిదే. బీజేపీపై విమర్శలన్నా, ఆరోపణలన్నా చంద్రబాబునాయుడు భయపడిపోతున్నరన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. గడచిన ఏడాదిన్నరగా కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వంపైన కాదు చివరకు రాష్ట్రంలోని బీజేపీ నేతలపైన కూడా మాట్లాడటానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు. కమలంపార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు లేకపోతే ఇతర నేతలు డైరెక్టుగా చంద్రబాబును కానీ లేకపోతే ఇతర నేతలను కూడా ఎంతగా ఎటాక్ చేస్తున్నారో అందరు చూస్తున్నదే. ఎవరెంతగా మాట్లాడినా తాను మాత్రం వాళ్ళకు ధీటైన సమాధానం చెప్పకూడదని చంద్రబాబు ఫిక్సయిపోయారు. సరే తాను మాట్లాడకపోవటం వరకు ఓకే. మరి ఇతర నేతలకు ఏమైంది ? కమలంపార్టీ నేతల ఆరోపణలకు ధీటుగా స్పందించే నేతలు టీడీపీలో చాలామందే ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఎందుకు నోరిప్పటంలేదు. పోలీసు దెబ్బలను మౌనంగా భరించినట్లుగా అయిపోయింది టీడీపీ నేతల పరిస్ధితి.



తాజాగా పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బీజేపీ నేతల వైఖరిని సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తావించారు. టీడీపీ నేతలపై బీజేపీ నేతలు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా మౌనంగా ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీ ఆరోపణలు, విమర్శలకు ధీటైన సమాధానం చెప్పకపోతే జనాలు వాటిని నిజాలనుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఎటాక్ చేయకుండా టీడీపీ హయాంలో కూల్చేసిన దేవాలయాల గురించి బీజేపీ నేతలు కావాలనే ప్రస్తావిస్తున్నారంటూ సోమిరెడ్డి మొత్తుకున్నారు. వైసీపీని విమర్శలు చేయాల్సిన బీజేపీ నేతలు ఆపని చేయకుండా టీడీపీని టార్గెట్ చేస్తుంటే మనమెందుకు ఊరుకోవాలంటూ సోమిరెడ్డి రెచ్చిపోయారు.



సోమిరెడ్డి మాట్లాడిందతా విన్న చంద్రబాబు చివరకు బీజేపీ నేతలపై ఎవరు మాట్లాడద్దంటూ ఆదేశించారు. బీజేపీ నేతల ఆరోపణలు, విమర్శలకు సమాధానాలు చెప్పటంలో తప్పులేదు కానీ గట్టిగా మాట్లాడి దాడులు చేయవద్దని స్పష్టంగా చెప్పేశారు. టీడీపీ టార్గెట్ మొత్తం వైసీపీనే ఉండాలికానీ బీజేపీ మీద కాదని గట్టిగానే చెప్పేశారు. ఎట్టి పరిస్ధితుల్లోను బీజేపీ నేతలపై గట్టిగా మాట్లాడద్దని చెప్పేశారు. చంద్రబాబు మాటలు విన్నతర్వాత బీజేపీ అంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో అందరికీ అర్ధమైపోయింది. ఎప్పటికైనా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. అసలే చంద్రబాబు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఒకవైపు చింతబరిక తీసుకుని జగన్మోహన్ రెడ్డి వాయించేస్తున్నారు. ఇదే సమయంలో ఇంతకాలం తాను ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళంతా చెల్లా చెదురైపోయారు. ఏవైపు నుండి కూడా తనకు సాయం అందుతుందనే ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. ఈ కారణంగానే చంద్రబాబు ఆశలన్నీ బీజేపీపైనే పెట్టుకున్నారు. ఎప్పటికైనా నరేంద్రమోడి కరుణించి దగ్గరకు తీసుకోకపోతాడా ? అని చూస్తున్న సమయంలో బీజేపీ నేతలపై గట్టిగా మాట్లాడితే ఇంకేమన్నా ఉందా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: