హెరాల్డ్ సెటైర్ : ఎల్లోమీడియా పిచ్చి పీక్సుకు చేరినట్లే ఉంది..చెత్తపలుకులో ఏముందో తెలుసా ?

Vijaya
జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎల్లోమీడియా పిచ్చి పీక్సుకు చేరినట్లే అనుమానంగా ఉంది. ఈవారం చెత్తపలుకులో ఎల్లోమీడియా ఎండి వేమూరి రాధాకృష్ణ రాసిన రాతలను చదివితే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. తన చెత్తపలుకులో చంద్రబాబునాయుడును విమర్శించలేక, జగన్మోహన్ రెడ్డిని సమర్ధించలేక, బీజేపీని తప్పుపట్టలేక నానా అవస్తలు పడ్డారు. ఇందులో భాగంగానే జగన్+బీజేపీపై తన ఆఫీసు గదిలో కూర్చుని తప్పుడు ఆలోనలతో ఏదో ఊహాజనితమైన కథనాలు అల్లేసి ఆ

హెరాల్డ్ సెటైర్ : ఎల్లోమీడియా పిచ్చి పీక్సుకు చేరినట్లే ఉంది..చెత్తపలుకులో ఏముందో తెలుసా ?




జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎల్లోమీడియా పిచ్చి పీక్సుకు చేరినట్లే అనుమానంగా ఉంది. ఈవారం చెత్తపలుకులో ఎల్లోమీడియా ఎండి వేమూరి రాధాకృష్ణ రాసిన రాతలను చదివితే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. తన చెత్తపలుకులో చంద్రబాబునాయుడును విమర్శించలేక, జగన్మోహన్ రెడ్డిని సమర్ధించలేక, బీజేపీని తప్పుపట్టలేక నానా అవస్తలు పడ్డారు. ఇందులో భాగంగానే జగన్+బీజేపీపై తన ఆఫీసు గదిలో కూర్చుని తప్పుడు ఆలోనలతో ఏదో ఊహాజనితమైన కథనాలు అల్లేసి ఆదివారం హెరాల్డ్ సెటైర్ : ఎల్లోమీడియా పిచ్చి పీక్సుకు చేరినట్లే ఉంది..చెత్తపలుకులో ఏముందో తెలుసా ?



జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎల్లోమీడియా పిచ్చి పీక్సుకు చేరినట్లే అనుమానంగా ఉంది. ఈవారం చెత్తపలుకులో ఎల్లోమీడియా ఎండి వేమూరి రాధాకృష్ణ రాసిన రాతలను చదివితే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. తన చెత్తపలుకులో చంద్రబాబునాయుడును విమర్శించలేక, జగన్మోహన్ రెడ్డిని సమర్ధించలేక, బీజేపీని తప్పుపట్టలేక నానా అవస్తలు పడ్డారు. ఇందులో భాగంగానే జగన్+బీజేపీపై తన ఆఫీసు గదిలో కూర్చుని తప్పుడు ఆలోనలతో ఏదో ఊహాజనితమైన కథనాలు అల్లేసి ఆదివారం చెత్తపలుకులో అచ్చేసేశారు. ఈ మొత్తంలో అర్ధమవుతున్నదేమంటే జగన్ తన శతృవును తానే తయారు చేసుకుంటున్నారట. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీకి జగన్ ఆర్దికసాయం చేయబోతున్నారట. ఉపఎన్నికలో చంద్రబాబును కట్టడిచేయటానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ సాయాన్ని కూడా బీజేపీ తీసుకోవాలని డిసైడ్ అయ్యిందట. బీజేపీ బలోపేతానికి జగన్ సహకరిస్తున్నారట. ఇలాంటి అనేక పిచ్చి రాతలతో చెత్తపలుకు నిండిపోయింది.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తన శతృవును తానే జగన్ ఎందుకు తయారు చేసుకుంటాడు ? తెలంగాణాలో బీజేపీ బలపడుతోందంటే అది కేసీయార్ చేతకాని తనం వల్లే అని అందరికీ తెలుసు. తెలంగాణాలో తనకు ప్రత్యర్ధులే లేకుండా చేయాలన్న కేసీయార్ పిచ్చి ఆలోచన వల్లే ఇపుడు బీజేపీ బలపడుతోంది. టీడీపీ+కాంగ్రెస్ ఎంఎల్ఏలను, నేతలను కేసీయార్ టీఆర్ఎస్ లో చేర్చుకుని బలహీనం చేసేశారు. దీంతో జనాలు అనివార్యంగా బీజేపీ వైపు చూస్తన్నారు. ఈ కారణం వల్లే బీజేపీ బలపడుతోంది. కానీ ఏపిలో టీడీపీ ఎంఎల్ఏలను ఏమీ వైసీపీలో చేర్చుకోలేదు. టీడీపీ నేతలను హోలుసేలుగా లాగేసుకోవటం లేదు. టీడీపీని బలహీనం చేయాలని జగన్ అనుకుంటే ఈపని ఎప్పుడో చేసుండేవారే అన్న విషయాన్ని ఎల్లోమీడియా మరచిపోయింది.



జగన్ సహకారంతో తిరుపతి ఉపఎన్నికలో టీడీపీని బీజేపీ మూడోస్ధానంలోకి నెట్టేయబోతోందట. రెండో ప్లేసులో ఎవరుండాలో తేల్చుకోవాల్సింది టీడీపీ, బీజేపీ మాత్రమే. అసలు బీజేపీని రెండోప్లేసులోకి తీసుకురావటానికి జగన్ ఏ విధంగా సాయం  చేయగలరు ?  టీడీపీ లాగే బీజేపీ కూడా వైసీపీకి ప్రత్యర్ధే అన్న విషయం జగన్ కు తెలీదా ? టీడీపీని నేలమట్టం చేసి ఆ స్ధానంలోకి తాను రావాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకు ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలన్నది బీజేపీ అంతర్గత వ్యవహారం. రెండో ప్లేసులో ఎవరుండాలన్ని టీడీపీ, బీజేపీల సమస్య. ఇందులో జగన్ ప్రమేయం ఏముంటంది ? వచ్చే ప్రతి ఓటును వైసీపీకి వేయించాలని జగన్ అనుకుంటారు కానీ బీజేపీకి మళ్ళించాలని అనుకుంటారా ? ఒకవేళ జగన్ అనుకున్నా సాధ్యమవుతుందా ?



సంక్షేమపథకాలతో జగన్ ప్రత్యేకమైన ఓటుబ్యాంకును సిద్ధం చేసుకుంటున్నారంటూ ఎల్లోమీడియా ఏడుపు బాగా కనబడుతోంది. అప్పటికి ఓటుబ్యాంకులను రెడీ చేసుకోవటం జగన్ తోనే మొదలైనట్లు. తన హయాంలో చంద్రబాబు కూడా ఓటుబ్యాంకును తయారు చేసుకోవటానికి ప్రయత్నాలు చేయలేదా ? కాకపోతే తాను చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలవ్వటం వల్లే ఘోరంగా ఓడిపోయారు. ఇపుడు జగన్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా అన్నది భవిష్యత్తు చెబుతుంది. హోలుమొత్తం మీద ఈవారం చెత్తపలుకు చూస్తే చంద్రబాబుకు ముందుముందు ఇబ్బందులు ఎదురవ్వబోతున్నాయన్న ఏడుపే కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ అస్తిత్వపైనే దెబ్బ పడబోతోందనే ఆందోళన కూడా పెరిగిపోతోంది. ఎవరిని ఆదరించాలి, ఎవరిని పక్కన పెట్టాయలన్నది జనాల ఇష్టంపై ఆధారపడుంటుంన్న విషయాన్ని చెత్తపలుకు మరచిపోవటమే విచిత్రం.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: