హెరాల్డ్ సెటైర్ : చలికాలంలో కూడా టీడీపీ నేతలకు చెమటలు పడుతున్నాయా ?

Vijaya
ఇంకా రాజధాని తరలింపు ప్రక్రియ మొదలేకాలేదు. అప్పుడే తెలుగుదేశంపార్టీ నేతలకు చెమటలు పడుతున్నట్లున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే విశాఖపట్నం జిల్లాలో బయటపడుతున్న టీడీపీ నేతల భూకబ్జాల బాగోతాలను చూసి జనాలందరు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా వైజాగ్ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ, మాజీ ఎంఎల్ఏ పీలా గోవింద సత్యనారాయణ చెరలో దశాబ్దాలుగా ఉన్న భూములను ప్రభుత్వం వెనక్కు తీసేసుకుంది. రుషికొండ, ఆనంద మండలంలో వీళ్ళ కబ్జాలో ఉన్న భూములను రెవిన్యు అధికారులు శనివారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకోవటమే కాకుండా ప్రభుత్వ భూమిగా చెప్పే బోర్డలను కూడా పెట్టేశారు. రుషికొండ ప్రాంతం అంటే వైజాగ్+విశాఖకు ఆనుకుని ఉన్న ఖరీదైన ప్రాంతాల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే.  ఆమధ్య సబ్బంహరి, గీతం యూనివర్సిటి యాజమాన్యం, గంటా, హర్షవర్ధన్ చౌదరి లాంటి అనేకమంది చెరలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు అధికారం అందుకున్న కొత్తల్లో వచ్చిన హుద్ హుద్ తుపాను చాలామంది టీడీపీ నేతలకు అదృఫ్టాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. తుపాను వల్ల నష్టపోతారు కానీ అదృష్టం ఎలా వస్తుందని అనుకుంటున్నారా . తుపాను దెబ్బకు వైజాగ్ జిల్లాల్లోని రుషికొండ, బీమిలీ, గాజువాక, పెందుర్తి లాంటి కొన్ని నియోజకవర్గాల్లో మొత్తం రెవిన్యు కార్యాలయాలు బాగా దెబ్బతినేశాయి. తుపాను దెబ్బకు రెవిన్యు రికార్డులు కూడా పాడైపోయాయి. తర్వాత మళ్ళీ రికార్డులను కొత్తగా సృష్టించుకోవాల్సొచ్చింది. ఆ సమయంలోనే వందలాది ఎకరాలకు  టీడీపీ నేతలు ఓనర్లయిపోయారు. అంతకుముందు కనీసం ఎకరా భూమి కూడా లేని వాళ్ళకు తుపాను పుణ్యమా అని పదుల ఎకరాలకు ఓనర్లయిపోయారట.



ఈ విషయాన్ని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా ఆరోపించారు. తన ఆరోపణలకు ఆధారాలను కూడా అప్పట్లో సిట్ విచారణకు ఇచ్చారు. సో ఆ విధంగా తుపాను దెబ్బకు మామూలు జనాలు దెబ్బతిన్నా,  ప్రభుత్వం నష్టపోయినా టీడీపీలోని కొందరు నేతలు మాత్రం లాభపడ్డారు. అప్పట్లో సిట్ విచారణ నివేదిక ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి కూడా మరో సిట్ విచారణ చేయించారు. ఆ నివేదిక ఫలితంగానే టీడీపీ నేతలకు ఎక్కడెక్కడ భూములున్నాయనే విషయాలను ఒక్కోటిగా బయటకు తీసి కబ్జా చెరవిడిపిస్తున్నారు. ఇందుకనే టీడీపీ నేతల్లో చాలామందికి చలికాలంలో కూడా చెమటలు పడుతున్నాయి. పరిపాలనా రాజధాని విశాఖపట్నంకు రాకుండానే టీడీపీ నేతలకు చెమటలు పడుతుంటే ఇక రాజధాని అయిపోతే ఇంకేమన్నా ఉందా ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: