లోకేష్ ను బురదలో కి గెంటేసి ఆహా ఓహో అంటారేంటయ్యా ?
అయితే అందరూ పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉందని అర్ధం చేసుకున్నాడో ఏమో కానీ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతూ హడావుడి చేసాడు. అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉందని, ఇక ఆలస్యం చేస్తే ఆ అచ్చెన్న పార్టీని తన్నుకెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు అనే భయం వేసిందో ఏమో తెలియదు కానీ, ఇప్పుడు ఫీల్డ్ లోకి దూకేసాడు. పోనీ పై పైనా రాజకీయాలు ముగించేద్దామని అనుకున్నా, అటువంటి వాటికీ ఇవి రోజులే కాదు. దీంతో సుకుమారంగా పెరిగిన తన పాదాలను బురదలోకి పెట్టి మరి పెరఫామెన్స్ చూపించాడు.
ఆ బురదలో కూరుకుపోయిన కాలు బయటకి రాలేదనే అసహనం పెరిగిపోయిందో ఏమో తెలియదు కానీ అక్కడి నుంచి గట్టిగానే తిట్ల దండకం అందుకున్నాడు. అసలు జగన్ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, వర్షాలతో ఇబ్బందులను ఎదుర్కుంటున్న వారిని అడ్డుకోలేదు అని, ఇలా రకరకాల విమర్శలు చేయగా ..! పో పోవయ్యా మా చెప్పొచ్చావ్ కానీ, మమ్మల్ని ఆ జగన్ గవర్నమెంటోళ్లు బాగానే ఆదుకున్నారు అంటూ మీడియా లైవ్ లోనే చెప్పేయడంతో అసలు ఏం మాట్లాడాలో తెలియక ఎడిట్ చేసిన వీడియోలను బాకా ఛానళ్లలో వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న చినబాబు గారిని తీసుకొచ్చి అది కూడా టైం కానీ టైం లో ఇలా బురదలోకి నెట్టేసారేంటయ్యా ...? ?