సెటైర్ : అమ్మో తెలంగాణాలో పవన్ ఎంట్రీ ఇస్తే ఏమవుతుందో

ఏపీలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, జనసేన అధినేత పవన్ మాత్రం ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు. ఏపీలో తమతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, తెలంగాణలో తమ పార్టీ తరఫున ప్రచారం చేసి తీరాల్సిందే అంటూ, ఆ బీజేపీ నేతలు పట్టుబట్టి మరీ బలవంతంగా ప్రచారానికి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలే ఏపీ లోనే సరిగా పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడేమో పార్టీ పరిస్థితి ఉన్నా, లేనట్టుగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో వేలు పెట్టడం అసలు ఎంత సాహసం అంటూ ఇప్పుడు రాజకీయ సానుభూతి పవనాలు ఇప్పుడు వేగంగా వీస్తున్నాయి. అసలు తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో పవన్ కు తెలియంది కాదు.

 అసలే సినిమాల మీద సినిమాలు చేసేందుకు ఎడాపెడా పవన్ సంతకాలు పెట్టేసారు. ఆ సినిమాలు విడుదల అయ్యి సక్రమంగా థియేటర్లలో ఆడాలంటే, ప్రభుత్వ సహకారం అవసరం. కానీ పవన్ టిఆర్ఎస్ పెద్దలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తే ? వారు  కత్తి కట్టి తిరిగి పవన్ పైనే బెదిరింపులకు దిగితే ? ఎలా అనేది ఇప్పుడు పవన్ కు అర్ధం కావడంలేదు. అందుకే తాను ఎన్నికల ప్రచారానికి దిగితే, ఆ తర్వాత పరిణామాలు ఏవిధంగా ఉంటాయో అనేది పవన్ కు బాగా తెలుసు. అందుకే కక్కలేక మింగలేక, ఆ బిజెపి నాయకులకు సమాధానం చెప్పలేక, పవన్ పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దానిని గట్టిగా, మొండిగా చెబితే, ఆ బిజెపి పెద్దలు వినే రకం కాదు.

అటువంటప్పుడు మాతో నీకేం అవసరం ? మీ పొత్తు మాకు అవసరంలేదు అని వారు ఎక్కడ నోరు జారుతారో అనే భయం పవన్ కు ఉంది. ఒక వేళ పొత్తు రద్దయితే, ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడాలో అనే భయం పవన్ లో కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణలో ప్రచారానికి దిగినా, టిఆర్ఎస్ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడలేక పవన్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో ఎన్నికలు పవన్ కు సంకటంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: