సెటైర్ : అలా భయపెట్టకు చినబాబు ?

హా... అయినా ఆ లోకేష్ కి ఏం తెల్సు..? వట్టి తండ్రి చాటు బిడ్డ. ఆ అంటే ఈ రాదు. ఏదో ఆయన తండ్రి గారు రాజకీయ ఉద్దండ పండితుడు కాబట్టి. లోకేసం బాబు గారి హవా చెల్లుతుంది  లేకపోతే ఆయన గారికి అంత సీన్ లేదమ్మా ..! అని నిట్టూర్చే వాళ్ళకి కొదవే లేదు. అసలు లోకేశం బాబు అంటే అందరికీ అలుసేనమ్మా ! అధికార పార్టీ వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు, అసలు బలమే లేని పార్టీలోళ్లు అందరూ ఆడిపోసుకోవడమే. అసలు ఏంటయ్యా బాబు బాబు సినబాబు కి ఈ పరిస్థితి తెచ్చావ్ ? అసలు ఫార్టీ ఇయర్స్ అనుభవశాలివి కొడుకుని ఇంత రాజకీయ అసమర్దుడిని చేసావ్ అంటూ తిట్లు వస్తున్నా, ఏంటయ్యా బాబు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించినా పెర్పామెన్స్ వీక్ గానే ఉంది ఏంటయ్యా బాబు ? అంటూ నిట్టూర్చుతూ నిందలు వేస్తుంటే..


అసలు ఎలా ఎలా కుదురుగా ఉండగలుగుతున్నావయ్యా బాబూ అంటూ ఎన్నోరకాల కామెంట్స్ వస్తున్నా సైలెంట్ గానే ఉండిపోయావ్ ? అంటూ ఒకటే వత్తిళ్లు వచ్చేస్తుంటే కసి కసిగా సినబాబు ని అర్జంటుగా అమరావతికి రప్పించి కాస్త జనాల్లో తిరగమని, పార్టీ నాయకులను బెదిరించమని బాబోరు చెప్పగానే, ఇంకేముంది ఆగమేఘాల మీద అమరావతి లో వాలిపోయి జనాల్లో తిరిగేశాడట. ఇంకేముంది ? పార్టీ వాళ్ళను కూడా పిలిపించి మీరు పనిచేయకపోతే మీ పదవులు ఊడతాయ్ అంటూ గట్టిగానే హెచ్చరికలు చేయడం తో పార్టీ వొళ్ళంతా కంగారు పడిపోయారట

 ... ఇదేంటి పిల్లిలా ఉండే సినబాబు చిరుతపులిలా మన మీదే గాండ్రిస్తూన్నాడు అంటూ బెదిరిపోయారట. నన్ను తక్కువంచనా వేసి నాతో అడ్డుకోవద్దు అంటూ బాలయ్య బాబు డైలాగులు నాలుగు చెప్పేసరికి ఇంకేముంది సినబాబు కి పార్టీ పగ్గాలు అప్పచెప్పండి. బాబోరు అంటూ ఉచిత సలహాలు నాలుగు పడేశారట పార్టీ వొళ్ళు. ఇంకేముంది సినబాబు గారిని లైన్ లో పెట్టేసి, విశ్రాంతోలోకి వెళ్ళిపోతే బెటర్ అనే ఆలోచనలో కూడా బాబోరు ఉన్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: