సెటైర్ : వరద ముంచుతున్నా.. బురద రాజకీయమే ?

ఒకవైపు వరద ముంచుకొచ్చేస్తోంది. వాగులు, వంకలు, పొంగిపొర్లిపోతున్నాయి. ఏపీలో ఎక్కడ చూసినా కొండపోత వర్షాలతో నీళ్ళే కనిపిస్తున్నాయి. ఇక నదులు, కాలువలు, డ్యాముల పక్కన ఉన్న వాళ్ళకి ముంపు భయం పెరిగిపోతోంది. ఎక్కడెక్కడ తలదాచుకుందామా అని ఒకటే పరుగులు పెడుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు బాబు గారు సైతం ఇక్కడే అంటే అమరావతిలోని తిష్ట వేశారు. అయ్యా చంద్రబాబు గారు మీరు ఉండాలనుకుంటున్న కరకట్ట కొంప అక్రమంగా నది లో నిర్మించారు. వరద పెరిగిపోతోంది. ఆ బురద మీకు అంటుకోక ముందే నిద్ర లేచి ఇంకో కొంప చూసుకోండి అంటూ తమ తప్పు లేకుండా అధికార పార్టీ వాళ్ళు నోటీసులు ఇచ్చి .. అయ్యా బాబు మీకో దండం అర్జంటుగా ఈ కరకట్ట అద్దె కొంప ఖాళీ చేసి మీరు ఇంకో కొంప చూస్కోండి.

 వరద పెరిగితే మళ్ళీ కనీసం ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదు అంటూ బురద రాజకీయం మొదలు పెట్టేస్తారు అంటూ చెప్పినా ..? ఏంటి ఇలాంటి వరదలు , బురదలు ఎన్నో చూసామమ్మా ..! నాకేం కొత్త కాదు. అయినా ఈ కొంప మునిగిపోతున్న సమయంలో నేను ఇక్కడే ఉండి చూసారా తమ్ముళ్లూ ఈ పభుత్వం నా కొంప ఎలా ముంచేసిందో ? ఆ వాన దేముడితో ఈ జగన్ కుమ్మక్కయ్యాడు. అందుకే ఇలా వర్షాలు కురిపించి నన్ను ఏడిపించాలని చూస్తున్నాడు. అసలు నా టైమ్ లో చక్కగా రాష్ట్రమంతా ఎడారిలా ఎంత చక్కగా ఉండేదో. ఇప్పుడేమో నేని వేసిన అమరావతి రోడ్లు సైతం కలువల్లా మారాయి. ఎంచక్కా అందులో పడవలేసుకుని తిరిగేలా ఎంత చక్కగా ముందు చూపుతో నిర్మించానో కదా ?

అది అర్ధం చేసుకోకుండా అందరూ తిట్టిపోస్తున్నారు. అసలు ఈ జగన్ పభుత్వం గత ఏడాది కూడా నా కరకట్ట కొంప కూల్చాలని చూసింది. అప్పుడూ రాజకీయమే చేశా. ఇప్పుడూ ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చినా నాకు అలవాటైన బురద రాజకీయమే నేను నమ్ముకున్నాను. చుడండి తమ్ముళ్లూ ... ? వచ్చే ఏడాది కూడా ఇక్కడే ఉంటాను.. వరద వస్తుంది .. కొంప మునుగుతుంది. మళ్ళీ నా భజన మీడియాలో బాబు కొంపను కావాలనే ముంచేస్తున్నారు అనే ఫీలింగ్ కల్పించాలి. చూడమ్మా కిట్టూ ..? ప్రతి పది నిమిషాలకూ ఓ ప్రోమో వేసి బాబొరి కొంపను ముంచుతున్న పభుత్వం అంటూ హడావుడి చెయ్యాలమ్మా  ! వరద వచ్చినా నేను మాత్రం బురద రాజకీయమే చేస్తానమ్మా ! రండి తమ్ముళ్లూ ...! వలయంగా ఏర్పడండి !  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: