సెటైర్ : హా... జగన్ తో బీజేపీ పొత్తా ? నేనొప్పుకోనంతే !

అసలేదో జరిగిపోతుంది ఇంకేదో జరిగిపోయేలా కనిపిస్తోంది. ఇప్పుడు జగన్ కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చేసింది. రేపో మాపో ఢిల్లీ ఫ్లయిట్ కూడా ఎక్కేందుకు సిద్ధం అయిపోయాడు. ఏమోయ్ జగన్ మా ప్రభుత్వంలో మీరు చేరవచ్చు కదా మిమ్మల్ని బాగా చూసుకుంటాం, మీ రాష్ట్రానికి మీరు ఏడాదిగితే అది చేసి పెడతాం. అసలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. మీకు మంచి మంత్రి పదవులు ఇచ్చేస్తాం ! పనిలో పనిగా బాబు ని ఆయన సుపుత్రుడిని చెడుగుడు ఆడిస్తాం. అంటూ హామీలు గట్రా ఇచ్చేసినట్టుగా ఢిల్లీ నుంచి వేడి వేడి సమాచారం వచ్చేసింది అని ఒకటే హడావుడి ఇప్పుడు నడుస్తోంది. అసలు అదే నిజమైతే ఏంటి పరిస్థితి ? మేము మా పార్టీ ఏమైపోవాలి.

 అసలు ఇప్పుడు తొక్కుతున్న తొక్కుడికి దిమ్మతిరిగిపోతుంటే మళ్ళీ ఉతుకుడు మొదలెట్టేలా కనిపిస్తున్నారు. అంటూ సైకిల్ పార్టీ అధినేత బాబోరిలో ఒకటే బాధ. అసలు ఈ బాధ చూడలేకే కదా పోనీలే బాబొరి ని ఆ కమలం పార్టీకి దగ్గర చేసేద్దామని ఆ మధ్య సైకిల్ పార్టీ నుంచి కమలం పార్టీలోకి జంప్ చేసిన నాయకులు గట్రా హడావుడి చేశారు. ఇప్పుడేమో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కొంప తీసి ఇప్పుడు నిజంగానే కమలం, ఫ్యాను పార్టీలు కలిసిపోతే ..? ఆ సీబీఐ గట్రా రంగంలోకి దిగిపోయి చెడుగుడు ఆడేస్తారేమో కదా ? అసలే లెక్కనేనంత సొమ్ములు బొక్కిన మా పార్టీలోకి ముఖ్యమైన నాయకులు చాలామందే ఉన్నారు. వాళ్లందరి గతి ఏం కావలి ? నేను నా వారసుడు ఏమైపోవాలి.

దిస్ ఈజ్ వెరీ దారుణం కదా ? అయినా గాని పెపంచ మేధావిని నన్ను వదిలేసి ఆ జగన్ వెంట ఈ కమలం పార్టీవోల్లు పడడం ఏంటి ? రక్తం మరిగిపోతోంది. గుండె నిబ్బరం చేసుకుని మరీ ఈ నిజాన్ని దిగ మింగుకోవాలాంటే ఎంత బాధగా ఉంటుందండి ? అసలు ఇప్పుడే జగన్ ను పట్టుకోలేకపోతున్నాం మళ్ళీ కమలం పార్టీ వొళ్ళు కూడా జత కలిస్తే ఇంకేమైనా ఉందా ? అస్సలు మేము పార్టీ ఎంత ఇబ్బంది పడిపోతాము. అస్సలు నేను ఈ ఫ్యాను , ఆ కమలం పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను.
ఇదిగో కిట్టూ ...! అసలు కమలం పార్టీ  ఫ్యాను పార్టీ పొత్తు అనైతికం, ప్రజాస్వామ్యానికి భంగం..! రాజకీయాలకే మచ్చ అని నీ పేపర్లో అచ్చేసి .. టీబీలో అదరగొట్టే ప్రసంగాలు డిబేట్ లు పెట్టి రచ్చ రచ్చ చేసేయావోయ్ !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: