సెటైర్ : ఇక్కడ ఉంది జగనమ్మా ! ఎవరైనా విలవిల్లాడాల్సిందే ?

జగన్ అంటే ఆషామాషీ వ్యక్తి అనుకున్నారో ఏమో తెలియదు కానీ, ప్రతిపక్షాలు అంతా మూకుమ్మడిగా దాడికి దిగాయి. ఇప్పటి వరకు జగన్ ను విమర్శించేందుకు సరైన కారణాలు కూడా వారికి దొరకలేదు. ఎవరికీ అందనంత ఎత్తులో జగన్ ఉండిపోయాడు. జనరంజక పథకాలను ప్రవేశపెట్టి ప్రతిపక్షాలు తనపై విమర్శలు చేసే అవకాశం లేకుండా చేసుకోగలిగాడు. జగన్ ను తిట్టి పోసేందుకు ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని కాచుకు కూర్చున్న ప్రతిపక్షాలకు ఇన్నాళ్లకు ఆయుధం దొరికింది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన రథం గత శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత దగ్ధం కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మతపరమైన సున్నితమైన అంశాలు ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో జగన్ ప్రభుత్వాన్ని దోషిని చేసేందుకు అన్ని రకాల దాని ప్రయత్నం చేయడంతో పాటు, రథం మంటల వ్యవహారంలో చలికాచుకునే ప్రయత్నిం చేశాయి. బీజేపీ జనసేన టిడిపి ఇలా అంతా ప్రభుత్వంపై తలో కాస్తా బురద చిమ్మారు. ఇక వైసీపీ పని అయిపొయింది అని, జగన్ హిందూ వ్యతిరేకి అని ముద్ర వేయించేందుకు, బిజెపి ద్వారా జగన్ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టాలని జనసేన, టిడిపి వంటి పార్టీలు గట్టిగా ప్రయత్నించాయి. ఇప్పటికే ఏపీ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసింది.

తేనె పట్టు కోసం కొంతమంది వ్యక్తులు చేసిన ప్రయత్నాల్లో భాగంగా రథం దగ్ధమైంది అని తేల్చినా, ఎవరూ నమ్మకపోగా అపహస్యం చేశారు. ఇలా అయితే లాభం లేదు అనుకున్నారో ఏమో కానీ, ఏకంగా  సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ జీవో జారీ చేయడంతో అంతా మళ్లీ జగన్ షాక్ కి గురయ్యారు.అసలే సిబిఐ ఎంక్వయిరీ కేంద్రం కంట్రోల్ లో పని చేసే సంస్థ అని అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సంస్థ ద్వారా దర్యాప్తు చేయించి నిజాలు నిగ్గు తేలిస్తే, అటు ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్లు అవుతుందని జగన్ చాలా ముందు చూపుతో, తెలివితేటలతో వేసిన ప్లాన్ తో అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు ఇంకో మాట మాట్లాడ్డానికి లేక సైలెంట్ అయిపోవడం ఒక్కటే మిగిలి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: