హెరాల్డ్ సెటైర్ : కొంపముణిగినా ఇంకా చంద్రబాబుకు బుద్ధి రాలేదా ?
తన ప్రభుత్వంపై జనాల్లో సంతృప్తస్ధాయి 90 శాతం ఉందని కొన్నిసార్లు 95 శాతం ఉందని డప్పు కొట్టకున్న రోజులేమయ్యాయి. అప్పట్లో ఆటిజిఎస్ అని డ్యాష్ బోర్డని ఏవో పిచ్చి పిచ్చి పదాలన్నీ చెప్పేస్తు దానితోనే సర్వేలంటూ చంద్రబాబు ఒకటే ఊదరగొట్టాడు. చంద్రబాబు సర్వేల పిచ్చిని బాగా అర్ధం చేసుకున్న ఓ ఐఏఎస్ అధికారి ఆడిందే ఆటగా తన అధికారాలను చెలాయించుకున్నాడు. తెల్లవారి లేస్తే చంద్రబాబు ముందు చూసింది సర్వే నివేదికలనే అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. 1100 అనే ఫోన్ నెంబర్ ను పెట్టేసి జనాల సమస్యలను పరిష్కరించేస్తామని చంద్రబాబు చెప్పిన వారంరోజులకే ఫోన్ నెంబర్ పనితీరుపైన కూడా సదరు ఐఏఎస్ అధికారి సర్వే జరిపించేశాడు. సమస్యల కోసం టెలిఫోన్ చేసే వాళ్ళతో సర్వే చేయిస్తే పరిష్కారం విషయంలో కూడా 90 శాతం జనాల్లో సంతృప్తి కనబడుతోందని రిపోర్టు ఇచ్చిన ఘనడు ఆ ఐఏఎస్ అధికారి.
సర్వేలు భోగస్ అని వాటి ఫలితాలు భోగస్ అని పార్టీ జనాలందరికీ తెలిసినా చంద్రబాబు మాత్రం సర్వేల పిచ్చిలో నుండి బయటపడలేకపోయాడు. చంద్రబాబుకు అంతలా పిచ్చి ముదిరిపోవటానికి ఎల్లోమీడియా కూడా ప్రధాన కారణమనే చెప్పాలి. ఏ విషయంలో అయినా పార్టీ నేతలు, కార్యకర్తలను కాదని ఎల్లోమీడియానే నమ్ముకున్నాడో అప్పటి నుండే చంద్రబాబు డౌన్ ఫాల్ స్టార్టయ్యిందనే చెప్పాలి. చంద్రబాబు పిచ్చి ఏ స్ధాయికి చేరుకుందంటే చివరకు నియోజకవర్గాల్లో పోటి చేసే అభ్యర్ధుల ఎంపికను కూడా సర్వేల ద్వారానే చేసేంతగా. అభ్యర్ధుల ఎంపికను కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలతో టెలిఫోన్ లో సర్వే చేయించి ఫైనల్ చేస్తానని చెప్పేంతగా ముదిరిపోయింది పిచ్చి. మొత్తానికి వందల కొద్దీ సర్వేలు చేయించుకున్న చంద్రబాబుకు ప్రజల తీర్పుతో దిమ్మతిరిగిపోయింది.