సెటైర్ : అర్జెంట్ గా ఎన్నికలు పెట్టాల్సిందే .. సిన బాబు గారు సింహాసనం ఎక్కాల్సిందే

ఎవరక్కడ ...? సిన రాజా వారు సింహాసనం ఎక్కేందుకు ఉబలాటపడుతున్నారు. అర్జంటుగా ఆ వైసీపీ సామ్రాజ్యం మీదకు దండెత్తి ఆ జగనుడిని భయపెట్టి సింహాసనం దిగామని ఆదేశించండి. వెంటనే యువ రాజా వారు సింహాసనం ఎక్కి కత్తి యుద్ధం చేయాలి అని చెప్పండి అంటూ మన చంద్రబాబు గారు కంగారు పడిపోతున్నారు. ఆయనకా వద్దన్నా వయసొచ్చి మీద పడిపోతోంది. దీనికి తోడు ఆ పాడు కారోనా భయం ఒకటి. ఇంట్లో ఉండలేము ... బయటకి వెళ్లలేము అన్నట్టుగా తయారయ్యింది, ఛీ ఛీ పాడు జీవితం అంటూ తిట్టుకుంటూ జూమ్ లో జూమ్ చేసి మరీ ఏపీ రాజకీయాలను చూస్తూ, అసలు నేను చేయలేని పనులు ఆ జగనుడు ఎలా చేసేస్తున్నాడో చూస్తూ, కుళ్ళుకుంటూ ఉన్నాడు.

ఈ సమయంలో సినబాబు సింహాసనం కావాలంటూ అల్లరి అల్లరి చేసేస్తున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటూ సలహాలు కూడా వస్తుండడంతో ఏదో రకంగా తాను యాక్టివ్ గా ఉండగానే ఏపీ లో సీఎం సింహాసనం ఎక్కించి సినబాబు గారిని తనివి తీరా చూసుకోవాలని ఆరాటపడుతుంటే... ఈ జగనుడు ఇంకా మూడున్నరేళ్లు అక్కడే ఉంటాడు. ఆ తరువాత కూడా అతడికే ఛాన్స్ అనే ప్రచారం తో బాబు గారి బీపీ అమాంతం పెరిగిపోతోంది. ఏపీకి వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు కానీ, ఉండి ఉంటే అర్జెంటుగా జగన్ ఇంటి ముందు కూడా ధర్నా చేసి సీఎం కుర్చీ ఖాళీ చేయమని చెప్పేవాడు. ఛీ ఛీ ఆ అవకాశం కూడా లేకుండా చేసింది ఈ పాడు కరోనా.

ఆ వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నా... వాళ్ళు వినిపించుకుంటే కదా ? అసలు ఈ వైసీపీ వాళ్లనో, ఆ జగనుడినో తిట్టుకోవడం కాదు, నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీలో అభి వృద్ధిని రుద్దీ, రుద్దీ రుద్దీనా నన్ను నమ్మకుండా ఆ జగన్ ను నమ్ముతారా ? బాధగా ఉండదా అండి ..? ఏం వీళ్ళ కోసం ఇంత చేస్తే ... వీళ్ళు తమాషా చేస్తారా ? వీళ్ళ పిచ్చ కథలు నా దగ్గర కాదు. మళ్ళీ దేవుడు, కమ్మగా కరుణిస్తే, ఎప్పుడో ఒకప్పుడు నేనో మా సిన బాబో సింహాసనం ఎక్కకుండా ఉంటామా ? ఈ జనాలపై కక్ష తీర్చుకోకుండా ఉంటామా అంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నట్టుగా ఆ చెవి నుంచి... ఈ చెవి నుంచి వచ్చి నా చెవిన పడ్డాయ్. నిజమేనా జూమ్ బాబు గారు ...? సారి సారి సెంద్రబాబు గారు !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: