సెటైర్ : బాబ్బాబు అన్నా పట్టించుకోరా ? బాధగా ఉండదా అండి ?

ఏం తమాషా చేస్తున్నారా ? పిచ్చకథలు చేయమాకండి !  కేంద్రం లో అధికారంలో ఉంటే ఏంటి ? మాకు ఎవరైనా మా ముందు తక్కువే. ఇది ఒకప్పుడు! దేశాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్న మీ పరిపాలన అందరికీ ఆదర్శం. మోదీ పరిపాలన లో దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ, ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తున్నారు. ఆహా మోదీ ఓహో మోదీ అంటూ భజన చేస్తున్నా, పో పోవయ్యా అన్నట్టుగా ఛీత్కారాలు ఎదురవుతున్నా బాబు గారు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మీరు పొమ్మంటే మేము పోతామా ? మాతో పొత్తు పెట్టుకునే వరకూ వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా బీజేపీ వెంట సైకిల్ వేసుకుని మరీ వెంతపడుతున్నా ఈ ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ గొప్ప తనం ఏంటో బాగా తెలుసు కాబట్టే బాబు నీకు మేము దూరం.. మా పార్టీలో నిన్ను మీ పార్టీని దూర్చుకోము అని చెప్పేస్తున్నా, పట్టు వదలని విక్రమార్కుడిలా వెంటపడి వేదిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఈ బాబు చెప్తే వినే రకం కాదనే ఏమోయ్ సోమూ కాస్త ఆ బాబు సంగతి చుస్కో అంటూ చెప్పేయడంతో ఇప్పటికే అనేక రిపేర్ లతో మూలాన పడిన సైకిల్ పార్ధులని మరిన్ని విరగ్గొట్టే పనిలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. పోనీ బీజేపీ లో చేరిన కోటరీ నాయకులేమైనా సహాయం చేస్తారా అంటే వారు కూడా ఇప్పడు సోమూ దెబ్బకు బెంబేలెత్తిపోయి ఏపీ వైపు చూసేందుకే దైర్యం చేయలేకపోతున్నారు. ఏపీలో అధికారం లేదు, బీజేపీ సహకారం లేదు, కానీ ఆ జనసేనాని అండదండలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి దాపరించడం తో పుత్రరత్నం లోకేశాన్ని రంగంలోకి దించాలని చూస్తున్నాడు.
 ఆన్లైన్ లో విమర్శలు చేయడం తప్ప బహిరంగంగా రంగంలోకి దిగి శత్రువులపై పోరాడే అంత శక్తీ సామర్ధ్యాలు లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ సంక్షోభ సమయంలోనే కరోనా రావడం, ఇల్లు కదిలే అవకాశం లేకపోవడం, ఢిల్లీ వెళ్లి చక్రాలు తిప్పే అవకాశం లేకపోవడం వంటి కారణాలతో బీజేపీకి ప్రేమతో అంటూ ప్రేమ లేఖలు రాసుకుంటూ వస్తున్నా బాబు లెక్కలన్నీ మాకు చెవిలో పువ్వు పెట్టడానికే అన్నట్టుగా కమలనాథులు వ్యవహరిస్తుంటే బాధగా ఉండదా అండి ...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: