సెటైర్ : భూమికి జానెడు.. భూలోక వీరుడు ! తుగ్లక్ కి తీసిపోడు
పోనీ ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాడా అంటే, అది లేదు. చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ, ... ఎప్పుడు ప్రాణం గాల్లో కలిసి పోతుందో తెలియని టెన్షన్ లోనే గడుపుతూ... ప్రజలను కూడా అదే రకమైన టెన్షన్ కు తన పాలన ద్వారా గురిచేస్తూ రావడం పరిపాటిగా మారింది. ఏ దేశంలోనూ లేనటువంటి వింత వింత నియమాలు, నిబంధనలు విధిస్తూ, ప్రజలకు నరకం అంటే ఏంటో చూపిస్తూ వస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ, అన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్నా, ఉత్తర కొరియాలో మాత్రం పెద్దగా ఆ ప్రభావం కనిపించకపోవడానికి కారణం, ఆ దేశం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలే అని పైకి చెబుతున్నా, ఆ వైరస్ సోకిన వారిని అనంత లోకాలకు పంపించేస్తున్నాడనే విమర్శలు కిమ్ మీద లేకపోలేదు.
అధికారులు ప్రజల ఇళ్లల్లోకి చొరబడ కుక్కలను లాక్కుని వెళ్తున్నారు. పోనీ వాటిని సంరక్షిస్తారా అంటే అదీ లేదు. వాటిని ప్రభుత్వం నిర్వహిస్తున్న జూలు, కుక్క మాంసం రెస్టారెంట్లకు తరలించేందుకు ఈ విధంగా ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుని, ఉత్తర కొరియాలో ఏర్పడిన ఆహార కొరతను తీర్చేందుకు ఉపయోగిస్తున్నారట. అసలు ఉత్తర కొరియా లో ఆహార కొరత ఏర్పడడానికి కారణం దేశ ఆదాయం మొత్తాన్ని ఎక్కువగా అణ్వాయుధాల తయారీకి ఉపయోగించడమే కారణమట.
ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి రంగాలు ఇప్పటికే కుదేలు అయ్యాయి. ఇప్పుడు ప్రజలు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కలను సైతం వదిలిపెట్టకుండా, స్వాధీనం చేసుకునే ప్రక్రియ కు కిమ్ శ్రీకారం చుట్టడం పై ప్రపంచవ్యాప్తంగా ఆయన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.