హెరాల్డ్ సెటైర్ : ఆ ఒక్క పనిచేస్తే పవన్ గ్రేటన్నట్లే ..చేయగలుగుతాడా ?
అధికార-ప్రతిపక్షాల రాజీనామాల గోల ఇలాగుంటే మధ్యలో అసెంబ్లీలో ఒకే సీటున్న జనసేన అధినేత పవన్ కూడా దూరేశాడు. టిడిపి ఎంఎల్ఏలందరితో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైసిపి ఎంఎల్ఏలు వెంటనే రాజీనామాలు చేసి ప్రజల తీర్పు కోరాలంటూ ఓ విచిత్రమైన డిమాండ్ చేశాడు. ప్రభుత్వం చేసిన పని నచ్చకపోతే ప్రతిపక్షాల ఎంఎల్ఏలు రాజీనామాలు చేయటం మనకు తెలిసిందే. మరి అధికార పార్టీ ఎంఎల్ఏలు ఎందుకు రాజీనామాలు చేయాలి ? ఇటువంటి తలతిక్క డిమాండ్లు పవన్ ఎందుకు చేసినట్లు ? ఎందుకంటే ఆరుమాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెత అందరికీ తెలిసిందే కదా . అదే పద్దతిలో దాదాపు ఐదేళ్ళు చంద్రబాబుతో పవన్ సావాసం చేశాడు కదా అందుకనే ఇటువంటి తలతిక్క డిమాండ్లు చేసినట్లు అర్ధమైపోతోంది. పైగా అంతకుముందు చంద్రబాబు ఇటువంటి డిమాండ్ చేశాడు కాబట్టే పవన్ కూడా గుడ్డిగా ఫాలో అయిపోయాడు.
సరే వాళ్ళని వీళ్ళని రాజీనామాలు చేయమని అడిగే బదలు ముందు ఆ రాజీనామా ఏదో తన పార్టీ నుండే మొదలుపెట్టొచ్చు కదా ? మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున రాజోలు నియోజకవర్గం నుండి రాపాక వరప్రసాద్ గెలిచాడు. పోటి చేసింది జనసేన తరపునే కానీ గెలుపులో జనసేన పాత్ర పెద్దగా లేదులేండి. ఈయన కూడా పూర్వాశ్రమంలో వైసిపి నేతే. ఆ పార్టీ నుండి పోటి చేసే అవకాశం దొరకలేదని జనసేనలో చేరి పోటి చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత నుండి రాపాకు, పవన్ మధ్య ఏమి జరిగిందో ఎవరికీ తెలీదు. పార్టీ కార్యక్రమాల్లో పవన్ తన ఎంఎల్ఏను చిన్న చూపుచూడటం మొదలుపెట్టాడు. దాంతో మెల్లిగా రాపాక పార్టీకి దూరమైపోయాడు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనబడటం లేదు. అందుకనే అసెంబ్లీలో కూడా స్వతంత్రంగా వ్యవహరించటం మొదలుపెట్టాడు.