సెటైర్ : చినబాబే అమ్మమ్మో.. అల్లరి పిల్లవాడే ?

య్య బాబోయ్ మామూలు పిల్లగాడు కాదు.. అల్లరి పిల్లవాడు. పార్టీలో అందరూ ముద్దుముద్దుగా చినబాబు అని పిలుచుకునే ఈ పిల్లగాడు అల్లరి అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ సమయంలో అందరూ ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే, ఈ పిల్లగాడు మాత్రం రోడ్లపై సైకిల్ వేసుకుని మరి చక్కెర్లు కొడతాడు. మందలగిరి లో ఓడిపోయినా,  తమ పార్టీ నామ రూపాల్లేకుండా చెదిరిపోయినా, ఈ పిల్లగాడు మాత్రం తాను ఇంకా మంత్రిని అన్నట్టుగా, అదే దర్పం ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఈ పిల్లగాడు దూకుడు తట్టుకోలేము అనుకున్నాడో ఏంటో తెలియదు కానీ, ఆయన తండ్రి గారు మాత్రమ్ సోషల్ మీడియాని చూసుకో బాబు, ఇంట్లోనే ఉండాలి, అల్లరి చేయకూడదు అంటూ చెప్పినా...   ఈ అల్లరి పిల్లగాడు ఊరుకుంటాడా ? ఇప్పుడు మొత్తం పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో తన పలుకుబడి పెంచుకుంటాను అంటూ మారం చేస్తూ మరింత అల్లరి మొదలు పెట్టాడు.

 


 జైలు కి వెళ్తున్న తమ పార్టీ నాయకులు ఒక్కొక్కరిని, పలకరిస్తూ వారి కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంగా విందు భోజనాలు చేస్తూ సోషల్ మీడియా కి దొరికిపోతున్నాడు.  వారి చేతిలోనూ అల్లరిపాలు అవుతున్నాడు. అయినా ఈ పిల్ల చేష్టలు ఇంకా మానలేదు. పెద్దల సభ గా పిలుచుకునే శాసనమండలిలో సభ్యుడిగా ఉన్న చినబాబు అక్కడ కూడా షరా మామూలుగానే అల్లరి చేస్తున్నాడు. ఇటువంటి వ్యవహారాలు ఇక్కడ చేయకూడదు అని చెప్పినా, మారం చేస్తున్నాడు. సెల్ ఫోన్ తీసుకుని రికార్డు చేస్తూ చేయాల్సిన అల్లరి అంతా చేస్తున్నాడు. 


అసలు పెద్దల సభ అంటే ఆయా రంగాల్లో నిష్ణాతులు, సీనియర్ రాజకీయ నాయకులు ఉంటారు. వారి అనుభవాలను రంగరించి రాష్ట్రానికి ఏ ఏ అంశాలు, నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది అనే విషయాలను చెబుతూ ఉంటారు. కానీ ఈ శాసన మండలి లో అందరి కంటే తానే చిన్నవాడిని అని గొప్పలు చెప్పుకుంటూ, తాను అల్లరి చేసినా పర్వాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తుడు చినబాబు. మూడేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న ఈ పిల్లగాడు రెండు సంవత్సరాలపాటు మంత్రిగా పని చేశారు. 


పెద్ద సభలో ఎంత పద్ధతిగా ఉండాలో మాత్రం తెలుసుకోలేక పోయాడు. అక్కడ పాటించాల్సిన నియమాలు, నిబంధనలు ఏవీ పట్టించుకోకుండా, తమ పార్టీకి పెద్దల సభలో పెద్ద బలం ఉంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఆ బలం మరికొద్ది రోజుల్లోనే తగ్గిపోతే..?  అప్పుడు ఈ పిల్లగాడు పరిస్థితి ఏమిటి ? అధికార పార్టీ సభ్యుల అల్లరికి సినబాబు తట్టుకోగలడా ? అప్పుడు చిన్న బుచ్చుకోవడం మాత్రమే చేయగలడు. 


చివరిగా చిన్న సెటైర్ : బాబు పక్క కి వెళ్లి ఆడుకోమ్మా ! 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: