ఏపిలో ఒక్క బిజెపి తప్ప మిగిలిన ప్రతిపక్షాలన్నీ తెలంగాణాకే మద్దతిస్తున్నాయా అనే అనుమానం జనాల్లో పెరిగిపోతోంది. తాజగా మొదలైన పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వివాదంలో ప్రతిపక్షాలు ఎందుకు మౌనంగా ఉండిపోయాయన్నదే ఇపుడు ప్రధాన ప్రశ్న. పోతిరెడ్డి పాడ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ+నెల్లూరు జిల్లాలకు సాగు, తాగు నీరందించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. ఇందుకు వీలుగా ఓ ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు జీవో 203 కూడా జారీ అయ్యింది. ఎప్పుడైతే జీవో 203 జారీ అయ్యిందో వెంటనే వివాదం మొదలైంది. జగన్ నిర్ణయంపై తెలంగాణా సిఎం కేసియార్ మండిపోతున్నాడు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణా ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలన్నీ కేసియార్ కు మద్దతుగా నిలబడుతున్నాయి. మరి ఏపి ప్రయోజనాల విషయంలో ప్రతిపక్షాలు కూడా జగన్ కు మద్దతుగా నిలబడాలి కదా ? కానీ తాజాగా మొదలైన వివాదం తెలంగాణా ప్రభుత్వానికి జగన్ కు సంబంధించిందన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఒక్క బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నాడు. మరి ప్రతిపక్షాలకు బాధ్యత లేదా ? టిడిపి, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఎందుకు ఈ విషయంలో మాట్లాడటం లేదు ?
జగన్ కు వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు చేయటంలో ఏకమవుతున్న ప్రతిపక్షాలన్నీ రాష్ట్రప్రయోజనాల విషయాన్ని మాత్రం గాలికొదిలేయటం విచిత్రంగా ఉంది. ప్రతిపక్షాలన్నీ కేసియార్ చూసి భయపడుతున్నాయా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాల్లో చాలా మంది ప్రముఖ నేతలకు హైదరాబాద్ లో ఆస్తులున్నాయి. తాము కేసియార్ ను వ్యతిరేకిస్తే తమ ఆస్తులు ఏమైపోతాయో ? అన్న భయంతోనే మాట్లాడటం లేదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో టిడిపికి దక్కింది కేవలం మూడంటే మూడే అసెంబ్లీ సీట్లు. మిగిలిన పార్టీలకు దక్కింది గుండుసున్నాయే. అంటే రాజకీయంగా తమను ఆధరించని రాయలసీమ, నెల్లూరు జిల్లాలు ఏమైపోతే తమకేంటి ? అనే ధోరణితో వ్యవహరిస్తున్నాయా ? అనే అనుమానం కూడా పెరిగిపోతోంది. ఏ పార్టీకి ఏ ఆలోచనున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎందుకు జగన్ కు మద్దతుగా నిలబడటం లేదన్న ప్రశ్నకు ప్రతిపక్షాలే సమాధానం చెప్పాలి. చూద్దాం ఏం చేస్తాయో ?
మరింత సమాచారం తెలుసుకోండి: