డబ్ల్యూటిసి ఫైనల్.. రోహిత్ గాయంపై క్లారిటీ?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది.. ఇక గాయం బారిన పడుతూ కీలకమైన టోర్నీలకు దూరమవుతున్నారు. ఇది ఇప్పుడు డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ విషయంలో కూడా ఇదే జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. గత ఏడాది ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా ఈసారి మాత్రం తప్పక విజయం సాధించి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఇక నేటి నుంచి జూన్ 11వ తేదీ వరకు కూడా డబ్ల్యూటీసి  ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

 లండన్ లోని ఓవల్ మైదానం ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కి అటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు టీమిండియా కు దూరమయ్యారు. ఇలాంటి కీ ప్లేయర్స్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగిపోతుంది అని చెప్పాలి. అయితే ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్న సమయంలో టీమిండియా కు మరో షాక్ తగిలింది  కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమ చేతి బొటన వేలికి గాయం అయినట్లు తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన బొటనవేలుకి ప్లాస్టర్ కట్టుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇప్పటికే కీలక ప్లేయర్స్ దూరమై టీమిండియా బలం కాస్త తగ్గింది. ఇప్పుడు కెప్టెన్ కూడా దూరం అయితే పరిస్థితి ఏంటో అని అందరిలో ఆందోళన మొదలైంది. అయితే ఇక రోహిత్ శర్మ గాయం పై క్లారిటీ వచ్చింది. రోహిత్ శర్మకు తగిలిన గాయం చిన్నది అని.. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో బరిలోకి దిగి జట్టును ముందు ఉండి నడిపిస్తాడు అని సమాచారం. ఇక ఈ విషయం తెలిసి టీమిండియా ఫ్యాన్స్ అందరు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: