డబ్ల్యూటీసి ఫైనల్.. టీమిండియాని భయపెడుతున్న గత రికార్డులు?

praveen
మరికొన్ని రోజుల్లో టీమిండియా అటు దేశ గౌరవాన్నీ నిలబెట్టబోయే మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా తో తలబడబోతుంది. ఈ మ్యాచ్ జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది ఆటగాళ్ళతో కూడిన టీం ను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం సెలెక్ట్ అయిన ఆటగాళ్లందరూ ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టి ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. అయితే మరోవైపు అటు ఆస్ట్రేలియా కూడా ఈ ఫైనల్ మ్యాచ్లో గెలవడానికి తీవ్రంగానే ప్రాక్టీస్ చేస్తుంది అని చెప్పాలి.

 రెండు పటిష్టమైన జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉండడంతో.. ఏ జట్టు గెలుస్తుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ విశ్లేషకులు అందరూ కూడా ఇక ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఎవరు విజేతగా నిలుస్తారు ఇక పాత గణాంకాలు ఎలా ఉన్నాయి.. ఎవరు ఎవరిపై పై చేయి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయంపైనే ఇక చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాను గత రికార్డులు మాత్రం టెన్షన్ పడుతున్నాయ్ అని చెప్పాలి.

 ఎందుకంటే ఇంగ్లాండులోని ఓవల్ మైదానం వేదికగా అటు టీమ్ ఇండియాకు మంచి రికార్డులు లేకపోవడం గమనార్హం. ఓవల్ వేదికగా ఇప్పటివరకు టీమిండియా 14 మ్యాచ్లు ఆడింది. అయితే ఈ 14 మ్యాచ్లలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది అని చెప్పాలి. ఇక ఇందులో ఏడు మ్యాచ్లు డ్రాగా ముగియగా.. ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. 2021 లో చివరిసారిగా ఇంగ్లాండ్ పై భారత్ ఈ మైదానంలో విజయం సాధించింది అని చెప్పాలి. ఇక్కడ కోహ్లీ, పూజార  రహానే రన్స్ చేయడానికి తంటాలు పడ్డారు. ఇలా గత రికార్డులు చూసుకుంటే ఓవల్ మైదానంలో టీమ్ ఇండియాకు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పాలి. అయితే క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది చెప్పడం కష్టం. మరి టీమిండియా ఈ డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్లో గత రికార్డులను చెరిపేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc

సంబంధిత వార్తలు: