గిల్ గురించి.. మా నాన్న మూడేళ్ల కిందట చెప్పాడు : ఏబిడి

praveen
టీమిండియా యంగ్ ఓపెన్ గత కొన్ని రోజుల నుంచి ఎంత అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు అంతర్జాతీయ క్రికెట్లో ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ప్రదర్శన చేసిన శుభమన్ గిల్. అటు ఐపీఎల్లో కూడా అదే రీతిలో విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న శుభమన్ గిల్ ఏకంగా 2023 ఐపీఎల్ సీజన్లో.. మూడు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయాడు అని చెప్పాలి.

 అంతేకాదు 850 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ప్లేయర్ గా కూడా శుభమన్ గిల్ రికార్డు సృష్టిస్తున్నాడు. అతని అద్భుతమైన ఫామ్ చూసి అటు మాజీ ప్లేయర్స్ సైతం ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఇక అతనే టీమ్ ఇండియా భవిష్యత్తు అని బల్ల గుద్ది మరి  చెబుతున్నారు భారత క్రికెట్ ప్రేక్షకులు. ఇకపోతే నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో గిల్ ప్రదర్శన ఎలా ఉండబోతుందో అనే దానిపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇకపోతే ఇటీవల గుజరాత్ ఓపెనర్ గిల్  గురించి మిస్టర్ 360 ప్లేయర్ ఎబి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 టీమిండియా యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ అద్భుతమైన ఆటగాడు అవుతాడని మా నాన్న మూడేళ్ల కిందటే ఊహించారు అంటూ ఏ బి డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.  ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా నాన్నకు గిల్ అంటే ఎంతో ఇష్టం. ఈజీగా సిక్సర్లు కొట్టడం కేవలం అతనికి మాత్రమే సాధ్యమవుతుంది. ముంబైతో మ్యాచ్లో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి టీమ్ ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉంది అంటూ ఏ బి టివిలియర్స్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: