ధోనీకి అలా.. రోహిత్ కు ఇలా.. ఇది కరెక్ట్ కాదంటున్న గవాస్కర్?

praveen
2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి కూడా మహేంద్ర సింగ్ ధోనీ పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అయితే మిగతా ప్లేయర్లు ఎంతలా మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. ధోని గురించి చర్చించుకున్నంతగా ఏ ఇతర క్రికెటర్ గురించి చర్చించుకోవడం లేదు. చెన్నై జట్టు ఓడిపోయిన గెలిచిన కూడా ఇక అందరూ మహేంద్ర సింగ్ ధోని  గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ గెలిచిన మిగతా జట్టు ప్రేయర్స్ గురించి మాత్రం ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఇక 2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు గుజరాత్ పై విజయం సాధించి ఫైనల్ కు వెళ్ళింది.

 దీంతో అందరూ కూడా ధోని కెప్టెన్సీ పై ప్రశంసలు కురిపించారు. ధోని కెప్టెన్సీకి తిరుగులేదు అంటూ ఆకాశానికి ఎత్తేసారు. అయితే ధోనిని పొగడడం మంచిదే. కానీ ధోని మాయలో పడిపోయి ఇతర ఆటగాళ్ల ప్రతిభను గుర్తించకపోవడం మాత్రం మంచిది కాదు అంటూ చెబుతున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావాస్కర్.  ఇటీవలే ముంబై ఇండియన్స్ ను ప్లే ఆఫ్ లో నిలిపిన ఘనత రోహిత్ కే దక్కుతుందని.. అతని వ్యూహాలతోనే ముంబై జట్టు ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకుంది అంటూ సునీల్ గవాస్కర్  వ్యాఖ్యానించాడు. అదే స్థానంలో ధోని ఉంటే ఇప్పటికే హంగామా చేసే వాళ్ళు అంటూ చెప్పుకొచ్చాడు.

 రోహిత్ ను తక్కువ అంచనా వేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కోసం అతను ఐదు టైటిల్స్ గెలిపించి పెట్టాడు. లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్ లో మంచి కెప్టెన్సీ ప్రదర్శన చేశాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో అతని వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయి. ఒకవేళ ముంబై స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉండి ఉంటే ధోని కెప్టెన్ గా ఉంటే.. ధోని తన వ్యూహంతో బ్యాట్స్మెన్ ల ఆట కట్టించాడు అంటూ అందరూ గొప్పగా చెప్పుకునే వాళ్ళు. కానీ రోహిత్ అదే చేస్తే మాత్రం అతనికి ఆ ఘనత దక్కడం లేదు. రోహిత్ కి కూడా సరైన ఘనత దక్కాలి. అతను కూడా మంచి వ్యూహాత్మకమైన కెప్టెన్ అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: