ముంబై క్వాలిఫైయర్ వెళ్లిందంటే.. కేవలం అతని వల్లే : ఇర్ఫాన్ పఠాన్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. అత్యధిక సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై హవా నడిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఏకంగా ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది ముంబై. రోహిత్ శర్మ సారధ్యంలో  ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. కానీ గత ఏడాది మాత్రం ముంబై ఇండియన్స్ ఎంత దారుణమైన ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మా అందరికీ తెలిసిన ఛాంపియన్ టీమేనా ఇంత దారుణంగా ఆడుతుంది అని అందరూ షాక్ అయ్యారు.

 అయితే 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభం సమయంలో కూడా ఇలా వరుసపరాజయాలతో సతమతమైన ముంబై ఆ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకుంది.  ఈ క్రమంలోనే ఏకంగా ప్లే ఆఫ్ లో అడుగుపెట్టడమే కాదు లక్నోతో ప్లే ఆఫ్ లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించి క్వాలిఫైర్ 2 కోసం అర్హత సాధించింది. ఈ క్రమంలోనే నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడి ఫైనల్ లో అడుగు పెట్టేందుకు పోరు కొనసాగించబోతుంది. అయితే ఇటీవల లక్నోతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి ముంబై జట్టును గెలిపించాడు  ఆకాష్ మద్వాల్.

 కాగా ఈ యంగ్ బౌలర్ పై టీమిండియా  మాజీ బ్యాట్స్మెన్ మహమ్మద్ కైఫ్ స్పందిస్తూ ప్రశంసల కురిపించాడు. సరైన లైన్ అండ్ లెంత్ తో ఆకాష్ మద్వాల్ బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ శైలి నాకు మహమ్మద్ షమిని గుర్తు చేసింది. అద్భుతమైన అతను ముంబైకి కాస్త ఆలస్యంగా దొరికిన ఆణిముత్యం.  ఎంతో మెచ్యూర్ గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మరో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం అతనిపై ప్రశంసించాడు. ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ ఇంత అద్భుతంగా ఆడటం చూడలేదు. ముంబై క్వాలిఫైయర్ కు చేరింది అంటే ఆ ఘనత ఆకాష్ కే దక్కుతుంది అంటూ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: