చరిత్ర సృష్టించిన ముంబై బౌలర్.. ఐపీఎల్ లో ఒకే ఒక్కడు?

praveen
ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటి వరకు లీగ్ మ్యాచ్లను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇక ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ లలో ఉండే ఉత్కంఠను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఫైనల్ పోరు జరుగుతూ ఉండడంతో ఈ ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నాకౌట్ మ్యాచ్ ల నేపథ్యంలో ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా రివ్యూ లతో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఫైనల్ పోరు కోసం ముందడుగు వేయాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. కీలక సమయంలో రాణించి ఐపీఎల్ లో ముంబై ఎందుకు ఛాంపియన్ టీం అయ్యిందో అన్న విషయాన్ని నిరూపించింది ముంబై ఇండియన్స్. అయితే మొదటి నుంచి మంచి ప్రస్థానాన్ని కొనసాగించిన లక్నో మాత్రం ఇక ఇటీవల ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇటీవలే ముంబై ఇండియన్స్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అటు లక్నో ఓటమిని శాసించాడు యంగ్ బౌలర్ ఆకాష్ మద్వాల్.  ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. అయితే అతను వేసిన బౌలింగ్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఐపిఎల్ హిస్టరీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అన్ క్యాపూడ్ ప్లేయర్గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ వేసి ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. అన్ క్యాడ్డ్ ప్లేయర్గా అతను అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: