సిఎస్కే ఫైనల్ వెళ్లడంపై.. సురేష్ రైనా ఏమన్నాడో తెలుసా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటివరకు ఏ జట్టుకి సాధ్యం కాని రీతిలో ఎక్కువసార్లు ఫైనల్లో అడుగుపెట్టిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఇక ఎక్కువ సార్లు ప్లే ఆఫ్ కి అర్హత సాధించిన టీం గాను కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే 2023 ఐపీఎల్ సీజన్ లోను చెన్నై సూపర్ కింగ్స్ ఎంతో విజయవంతమైన ప్రస్థానం కొనసాగించి ఇక ఫైనల్లో అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జోరు చూస్తూ ఉంటే తప్పకుండా టైటిల్ గెలవడం ఖాయమని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. అయితే మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కప్పు గెలిచి ఇక ధోనీకి ఘనమైన వీడ్కోలు పలికితే బాగుంటుందని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ధోనీకి మద్దతు పలికేందుకు మ్యాచ్ ఎక్కడ జరిగిన కూడా చెన్నై అభిమానులు అందరూ కూడా భారీగా తరలివస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్ కి వెళ్లడం పై ఆ జట్టు మాజీ ఆటగాడు మిస్టర్ ఐపిఎల్ సురేష్ రైనా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 చెన్నై జట్టుపై ప్రశంసలు కురిపించాడు. 10 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ చేరుకోవడం అద్భుతం అంటూ సురేష్ రైనా తెలిపాడు. మహేంద్రసింగ్ ధోని జట్టును సునాయాసంగా ముందుకు నడిపించారని ప్రశంసించాడు సురేష్ రైనా. దేశం మొత్తం ధోని మళ్లీ ఐపీఎల్ టైటిల్ను గెలవాలని ఎదురుచూస్తుంది అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. అయితే గతంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో  రైనా కూడా కీలక పాత్ర వహించాడు. కానీ ఆ తర్వాత మాత్రం చెన్నై యాజమాన్యం అతని పక్కన పెట్టడంతో చివరికి ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటికీ సురేష్ రైనా క్రియేట్ చేసిన  కొన్ని రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: