150 వికెట్లు.. 2వేల పరుగులు.. ఐపీఎల్ లో జడేజా అరుదైన రికార్డు?

praveen
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్ రౌండర్లు ఎవరబ్బా అని చర్చ వచ్చినప్పుడల్లా.. రవీంద్ర జడేజా పేరు మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బ్యాటింగ్లో బౌలింగ్ దగ్గరికి ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉంటాడు రవీంద్ర జడేజా. ఇక మైదానంలో పాదరసంలా కదులుతూ రవీంద్ర జడేజా చేసే ఫీల్డింగ్ విన్యాసాలు అయితే ప్రేక్షకులను అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఈ క్రమంలోనే ఇక తన ఆటతీరుతో ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తూ ఉంటాడు రవీంద్ర జడేజా.

 ఇక ఐపీఎల్ లో కూడా ఎన్నో సార్లు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ని  ఐపీఎల్ విజేతగా నిలిపేందుకు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తనవంతు కృషి చేస్తున్నాడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో క్వాలిఫైయర్ వన్ పోరులో భాగంగా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  బ్యాటింగ్లో 16 బంతుల్లో 22 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడిన  జడేజా.. బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు రవీంద్ర జడేజా. ఇటీవల తీసిన రెండు వికెట్లతో ఏకంగా 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

 ఈ క్రమంలోనే ఐపిఎల్ చరిత్రలో 2000కు పైగా పరుగులు.. 150 వికెట్లు తీసిన తొలి ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. అంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బౌలర్ బ్రావో పేరిట ఉండేది. బ్రావో ఐపీఎల్లో 1560 పరుగులు 183 టికెట్లు తీయగా.. ఆ తర్వాత సునీల్ నరైన్ ఒక వెయ్యి 46 పరుగులతో పాటు 163 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇద్దరూ జడేజా కంటే ఎక్కువ వికెట్లు తీసినప్పటికీ బ్యాటింగ్లో మాత్రం 2000 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. జడేజా అది సాధించి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పదవ సారి ఐపీఎల్ ఫైనల్ లో అడుగుపెట్టి.. ఎక్కువసార్లు ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: