డబ్ల్యూటీసీ ఫైనల్.. కేవలం నలుగురు ఇండియన్ ప్లేయర్లకే ఛాన్సిచ్చిన రవి శాస్త్రి?

praveen
ఈ మధ్యకాలంలో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి వ్యాఖ్యాతలుగా మారిన ఎంతో మంది మాజీ ఆటగాళ్లు రివ్యూలు ఇవ్వడంలో తెగ బిజీగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇక ఆ మ్యాచ్లలో ఎవరు ఆడితే బాగుంటుంది అనే విషయంపై ఇక తమ అభిప్రాయం ప్రకారం ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును సోషల్ మీడియాలో ప్రకటించడం లాంటివి చేస్తున్నారు. ఇక మరి కొంతమంది ప్లేయర్లు ఆ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుంది అనే విషయంపై ముందుగానే ఒక అంచనా వేసి రివ్యూ చెప్పేస్తూ ఉన్నారు.

 దీంతో అంతర్జాతీయ క్రికెట్లో జరిగే కీలకమైన మ్యాచుల సమయంలో ఇలా మాజీ ప్లేయర్లు సోషల్ మీడియా వేదికగా చెప్పే రివ్యూలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అంతేకాదు మ్యాచ్ పై అటు అందరిలో ఆసక్తిని పెంచుతూ ఉన్నాయి. అయితే ఇలా ఏ మ్యాచ్ జరుగుతున్న తన ప్లేయింగ్ ఎలివేన్ జట్టును ప్రకటించడంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ముందుంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో అటు లండన్ వేదికగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పోటీ ఉండబోతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఇప్పటికే చర్చ మొదలైంది.

 ఇక ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి.. డబ్ల్యూటీసి ఫైనల్ కు భారత్ ఆస్ట్రేలియా జట్ల నుంచి కంబైన్డ్ టెస్ట్ టీం ని ప్రకటించాడు. ఇందులో భారత్ నుంచి కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేశాడు.  ఇక రవి శాస్త్రి ప్రకటించిన టీం చూసుకుంటే.. రోహిత్ శర్మను కెప్టెన్గా ఎంచుకున్నాడు. ఖవాజా, మార్నస్ లబుషణ్, విరాట్ కోహ్లీ, స్టివ్ స్మిత్, జడేజా, శమీ, లియోన్, అలెక్స్ కారి, కమిన్స్, స్టార్క్ లను ఎంచుకున్నాడు రవి శాస్త్రి. ఇకపోతే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంగ్లాండులోని ఓవల్ మైదానంలో జరగబోతుంది అని చెప్పాలి. ఇప్పటికే ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఇక డబ్ల్యూటీసి ఫైనల్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: