గిల్ సెంచరీపై.. హార్థిక్ పాండ్యా ఏమన్నాడో తెలుసా?

praveen
టీమ్ ఇండియాలో యంగ్ ఓపెనర్ గా కొనసాగుతున్న శుభమన్ గిల్ గత కొంతకాలం నుంచి అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందె. ఈ క్రమంలోనే ఫార్మాట్ తో సంబంధం లేకుండా సంచలన ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉన్నాడు. ఒకప్పుడు టీమిండియా తరఫున వరుసగా సెంచరీలు చేసి అదరగొట్టిన శుభమన్ గిల్ ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అదే రీతిలో జోరును కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం అటు గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున కొనసాగుతున్న గిల్ ఇక ఐపీఎల్లో కూడా సెంచరీల మోత మోగించాడు.

 వరుసగా రెండు మ్యాచ్ లలో కూడా సెంచరీలు చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా గిల్ మరోసారి సెంచరీ తో చెలరేగిపోయాడు. దీంతో ఎంతో అలవోకగా గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇక గిల్ ఫామ్ చూసి అటు మాజీ ఆటగాళ్ళు అందరూ కూడా ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ఇకపోతే ఇటీవలే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా సైతం గిల్ సెంచరీపై పరిశంసలు కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో గిల్ సెంచరీ అద్భుతం అంటూ కెప్టెన్ హార్దిక్ ప్రశంసించాడు.

 బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ ను మా బాయ్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఫినిష్ చేశారు. ముఖ్యంగా గిల్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. స్టేడియం నలుమూలల ఆడిన గిల్ ఆట ఎంతో కొత్తగా అనిపించింది. బౌలర్లకు ఎటువంటి చాన్స్ ఇవ్వకుండా చెలరేగిపోయాడు. దీంతో సూపర్ సెంచరీ చేసి ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. కానీ మేం బౌలింగ్ లో విఫలం అయ్యాం. కానీ విజయం మాత్రం మా వైపే ఉంది అంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసించాడు. ఇక కోహ్లీ సెంచరీ కూడా సూపర్ అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: