ఐపీఎల్ : నేడే కీలక పోరు.. ఫైనల్ కు ముందెవరూ?

praveen
ఎన్నో రోజుల నుంచి అటు క్రికెట్ లవర్స్ అందరికీ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అనే విషయం తెలిసిందే. ఎంతో రసవత్తరంగా జరిగిన లీగ్ మ్యాచ్లలో ఇక నాలుగు జట్లు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలోనే నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఐపిఎల్ హిస్టరీలో రెండు దీటైన జట్లు అయినా చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య డి అంటే డి అనే విధంగా నేడు మ్యాచ్ కు రంగం సిద్ధమైంది అని చెప్పాలి.

 ఈ మ్యాచ్ లో భాగంగా నాలుగు సార్లు ఛాంపియన్ అయినా చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్గా పేరు సంపాదించుకున్న గుజరాత్ టైటాన్స్ తలబడబోతుంది అని చెప్పాలి.  చెన్నై వేదికగా మ్యాచ్ జరగడం ధోని సేనకు ఎంతో అనుకూలమైన అంశమె. అయితే ఈ జట్టు పై ఓటమి ఎరుగని గుజరాత్ కొండంత ఆత్మవిశ్వాసంతో బలులోకి దిగేందుకు సిద్ధమైంది. ఇలా రెండు సమవుజ్జిల మధ్య ఆసక్తికర సమరం అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన మజాని పంచడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

 ఈ క్రమంలోనే ఈ కీలకమైన పోరులో విజయం సాధించి ఇక ఫైనల్లో అడుగుపెట్టబోయే మొదటి టీం ఏది అనే విషయంపై కూడా ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు రివ్యూలు ఇచ్చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ కు క్వాలిఫై అవుతుంది. అయితే ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ఇక మరో ప్రయత్నంగా రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఇలా ఫైనల్ మ్యాచ్.. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్.. రెండు కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరగబోతున్నాయి అని చెప్పాలి. మరి నేటి మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: