ఆ విషయాన్ని.. ఇంకా నమ్మలేకపోతున్నాం : సంజు శాంసన్

praveen
2023 ఐపీఎల్ సీజన్లో మంచి ప్రస్తానాన్ని కొనసాగించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఇప్పుడు ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుందా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే 14 లీగ్ మ్యాచ్లు ఆడేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇక ఇప్పుడు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలి అంటే ఇతర జట్లు ఆడుతున్న మ్యాచ్ ఫలితాలు పైనే భవితవ్యం ఆధారపడి ఉంది . ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 2023 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్ లో విజయం సాధించింది.  ధర్మశాల వేదికగా  జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి.. సాంకేతికంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలిచింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ప్రస్తుతం రాజస్థాన్ 14.లతో 5వ స్థానంలో కొనసాగుతుంది.

 కాగా నేడు జరగబోయే ముంబై, బెంగళూరు మ్యాచ్ బెంగళూరు జట్టు ఓడిపోతే రాజస్థాన్కు ఇక ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ప్రదర్శన పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పంజాబ్ 188 పరుగుల టార్గెట్ ను రాజస్థాన్ 19.4 ఓవర్ లలో చేదించింది. ఒకవేళ 18.3 ఓవర్ లలో పూర్తి చేసి ఉంటే.. నెట్ రన్ రేట్  విషయంలో బెంగళూరును అధిగమించి ఇక నాలుగవ స్థానంలో కొనసాగేది. ఇక ఇదే విషయంపై మాట్లాడాడు రాజస్థాన్ కెప్టెన్.  హెట్మేయర్ క్రీజు లో ఉండడంతో మ్యాచ్ ను 18.5 ఓవర్లలోనే ముగిస్తాం అని అనిపించింది.

 అత్యున్నతమైన ఆటగాళ్లతో కూడిన జట్టు మాది.  అయితే మేము పాయింట్లు పట్టికలో ఉన్న స్థానాన్ని చూస్తే మాకే షాకింగ్ అనిపిస్తుంది అంటూ సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. మా జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్  ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రానించాడు. ఎంతో పరిణీతితో పరుగులు చేసాడు. ఒక వంద అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడిన అనుభవజ్ఞుడి లాగా అతను బ్యాటింగ్ చేశాడు. ఇక  బౌల్ట్ తన తొలి ఓవర్లోనే వికెట్ తీస్తాడని మేము 90% అంచనా వేశాం. సరిగ్గా అలాగే వికెట్ తో శుభారంభం  కూడా లభించింది.  గత మ్యాచ్ల్లో ఓడిపోయి చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి విజయం సాధించాం. ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలని బలంగా కోరుకుంటున్నాం అంటూ సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: