ఐపీఎల్ : జడేజాపై సీరియస్ అయిన ధోని?

praveen
2023 ఐపీఎల్ సీజన్లో ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి తన హవా నడిపించింది. మొదటి నుంచి ఎంతో విజయవంతమైన ప్రస్తానాన్ని కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇక ఇటీవల ఢిల్లీ జట్టుపై ఘనవిజయాన్ని సాధించడం ద్వారా ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన రెండో టీం గా రికార్డు సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేసి 223 పరుగులు చేయగా.. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టును 143 పరుగులకే పరిమితం చేసింది చెన్నై బౌలింగ్ విభాగం. దీంతో 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

 ఈ క్రమంలోనే 17 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది. ఇకపోతే చెన్నై జట్టు ప్లే ఆఫ్ కి అర్హత సాధించడంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఇది ఎలా ఉంటే మ్యాచ్ ముగిసిన అనంతరం అటు రవీంద్ర జడేజా పై మహేంద్రసింగ్ ధోని సీరియస్ కావడం ఆసక్తిని కలిగించింది అని చెప్పాలి. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఒకరిని ఒకరు అభినందించుకున్న అనంతరం ఈ ఘటన జరిగింది.

 ప్లేయర్స్ అందరూ కూడా డగవుట్ వైపు వెళ్తున్న సమయంలో జడేజా దగ్గరికి వచ్చిన ధోని సీరియస్ గా ఏదో అంశంపై చర్చించాడు. జడేజా కూడా అటు ధోని చెప్పింది ఎంతో సీరియస్ గా  విన్నాడు. అయితే ఇక ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా బౌలింగ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్లో ఏడు బంతుల్లో 20 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అటు బౌలింగ్లో మాత్రం నాలుగో ఓవర్లు వేసి 50 పరుగులు సమర్పించుకున్నాడు జడేజా. ముందు ప్లే ఆఫ్ లో కీలకమైన మ్యాచులు  ఉన్న నేపథ్యంలో ఇక జడేజాను ధోని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: