ఐపీఎల్ హిస్టరీ లో.. 15 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన జైష్వాల్?

praveen
2023 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న  యశస్వి జైష్వాల్ బ్యాటింగ్లో సృష్టిస్తున్న విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంది సీనియర్ క్రికెటర్లు సైతం ఒత్తిడికి తట్టుకోలేక చేతులెత్తేస్తున్న సమయంలో అటు ఐపీఎల్ లో పెద్దగా అనుభవం లేని యశస్వి జైష్వాల్ మాత్రం అటు ప్రపంచస్థాయి బౌలర్లు సైతం ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే రాజస్థాన్ విజయాల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ లో ఎంతో కీలకంగా మారిపోయాయి .

 ఈ క్రమంలోనే 15 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీ లో ఏ ఆటగాడికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును కూడా యశస్వి జైష్వాల్ సాధించి చరిత్ర సృష్టించాడు. సీనియర్ ఆటగాళ్లకే సాధ్యం కాని రీతిలో నిలకడైన ఫామ్ కొనసాగిస్తున్న యశస్వి జైస్వాల్ అత్యంత నిలకడైన ఆటగాడిగా మారిపోయాడు. అంతేకాదు ఇక ఓ ఐ పీ ఎల్ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్గా అడుగుపెట్టి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ అరుదైన మైలురాయిని  అందుకున్నాడు ఈ యంగ్ సెన్సేషన్ బ్యాట్స్మెన్.

 పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 36 బంతుల్లో 8 బౌండరీలతో 50 పరుగులు చేసి మరోసారి తన ఫామ్ కొనసాగించాడు. ఇక ఇప్పటివరకు రాజస్థాన్ తరఫున జైష్వాల్ ఆడిన 14 మ్యాచ్ లలో  కలిపి 48.07 సగటుతో 625 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఐదు అర్థ సెంచరీలు కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్ అత్యధిక పరుగులు చేసిన 15 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ షాన్ మార్ష్ అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఉండి.. 11 మ్యాచ్లో 616 పరుగులు చేయగా.. ఇక ఇప్పుడు యశస్వి జైస్వాల్ 625 పరుగులు చేసి రికార్డు బద్దలు కొట్టాడు. ఇలా 15 ఏళ్లుగా ఎవరు బ్రేక్ చేయలేకపోయినా రికార్డ్ ను యశస్వి మొదటి సీజన్లోనే బ్రేక్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: