ఒక్కడి కోసం ఇంతమందా.. నిజంగా అతను యుగపురుషుడే?

praveen
ఐపీఎల్ ఏ ముహూర్తాన మొదలైందో కానీ అటు క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ధోనీ ఫీవర్ పట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు నుంచే లెజెండ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం మొదలైంది. దీంతో ఇక చివరి ఐపిఎల్ లో ధోని ఆటను చూసి ఎందుకో అభిమానులందరూ కూడా తెగ ఆసక్తి కనబరిస్తున్నారూ. దీంతో మ్యాచ్ ఎక్కడ జరిగిన కూడా పట్టించుకోకుండా స్టేడియం కు తరలి వెళ్తూ ఉన్నారు. దీంతో హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్న టీం అభిమానుల కంటే.. చెన్నై అభిమానులు ఎక్కువగా స్టేడియం లో కనిపిస్తూ ఉండడం గమనార్హం.

 చివర్లో ధోని వచ్చి ఒకటి రెండు బంతులు ఆడిన సరే పర్లేదు అనేట్లుగా ఇక అభిమానులందరూ ధోని ఆటను చూసేందుకు తహతహలాడిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా కూడా ధోని అభిమానులు గురించి చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఘన విజయాన్ని అందుకున్న చెన్నై జట్టు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయింది. ఇదంతా పక్కన పెడితే.. ఇక ఈ మ్యాచ్ కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు స్టేడియానికి వస్తున్న సమయంలో వీధులన్నీ జనసంద్రంతో నిండిపోయాయి. దీనికంతటికి కారణం బస్సులో ధోని ఉండడమే.

 చెన్నై సూపర్ కింగ్స్ స్టేడియం కి వస్తున్న దారి పొడవునా కూడా సీఎస్కే జెర్సీలు ధరించిన అభిమానులు ధోనినీ చూడడం కోసం ఏకంగా సీఎస్కే టీం వస్తున్న బస్సును చుట్టుముట్టారు. కొందరు కార్ల  పై నిలబడి తమ అభిమాన ఆటగాడికి చేతులు ఊపారు. ఇక ధోని చూడడానికి ఎంతో మంది అభిమానులు తరలి రావడంతో కనీసం బస్సు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇక కాసేపు అక్కడ ఉత్కంఠ నెలకొన్నప్పటికీ తర్వాత అభిమానులు బస్సుకి దారి ఇచ్చారు. దీంతో ధోనీ క్రేజ్ ఏంటి అన్నది మరోసారి నిరూపితం అయింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: