2023 ఐపీఎల్ సీజన్.. అరుదైన రికార్డు?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది ప్రతి బ్యాట్స్మెన్. దీంతో క్రీజులోకి రావడం రావడమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటారు ఎంతోమంది. ఇక ఇలా సిక్సర్లు కొట్టాలి అనే మైండ్ సెట్ తో ఉన్న బ్యాట్స్మెన్లకు బౌలింగ్ చేయడం అటు బౌలర్లకి కత్తి మీద సాము చేయడం లాంటిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ఐపీఎల్ సీజన్లో అయితే ఇలాంటి బ్యాటింగ్ విధ్వంసం మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. యంగ్ ప్లేయర్స్ తో పాటు సీనియర్ ప్లేయర్స్ కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచి సత్తా చాటుతూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఐపిఎల్ హిస్టరీలో అరుదైన రికార్డులు క్రియేట్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇక ఎప్పటిలాగానే 2023 ఐపీఎల్ సీజన్లో కూడా అన్ని జట్ల ప్లేయర్లు సిక్సర్లు ఫోర్ లతో చెలరేగి పోయారు. ముఖ్యంగా ఇప్పుడు వరకు ఐపీఎల్ లో వెయ్యి సిక్సర్లు నమోదు చేశారు అని చెప్పాలి. అయితే గత ఏడాది ఐపీఎల్ సీజన్ వరకు కూడా ఏ సీజన్లో 1000 సిక్సర్లు నమోదైన దాఖలాలు లేవు. కానీ గత ఏడాది ఐపీఎల్ నుంచి మాత్రం బ్యాట్స్మెన్లు మరింత విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దీంతో అరుదైన రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.

 అయితే 2023 ఐపీఎల్ సీజన్లో ఇటీవలే 1000 సిక్సర్లు బాదారు బ్యాట్స్మెన్లు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ కాన్వె 6 కొట్టడం ద్వారా ఇలా ఐపీఎల్లో 2023 సీజన్ 1000 సిక్సర్ల మార్క్ అందుకుంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ హిస్టరీలో 1000 సిక్సర్లు నమోదు కావడం ఇది రెండోసారి. 2022 ఐపిఎల్ సీజన్లో మొదటిసారి 1000 సిక్సర్ లను  కొట్టారు బ్యాట్స్మెన్లు. కాగా ఇప్పుడు అదే రికార్డు మళ్లీ 2023 ఐపీఎల్ సీజన్లోని రిపీట్ అయింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా ఆర్సిబి కెప్టెన్ డుప్లేసెస్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 36 సిక్సర్లు  కొట్టాడు డూప్లెసెస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: