రికార్డు విజయం.. ఢిల్లీ స్టేడియంలో చరిత్ర సృష్టించిన చెన్నై?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ 2023 ఐపీఎల్ సీజన్ లోను అదే రీతిలో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లో కాస్త తడబాటుకు గురైనట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకుని అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది ఈ టీం. ఇక మహేంద్ర సింగ్ ధోని ఎప్పటి లాగానే తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తున్నాడు అని చెప్పాలి.

 అంతే కాదు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు వస్తున్నాయి.  ఇక చెన్నై జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా కూడా ప్రేక్షకులు అందరూ కూడా స్టేడియంకి భారీగా తరలివస్తూ ఉన్నారు. దీంతో హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్న జట్టు అభిమనుల కంటే చెన్నై అభిమానులు ఎక్కువగా కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవలే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో మ్యాచ్ ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ధోని అభిమానులు భారీగా తరలి రావడంతో స్టేడియం మొత్తం పసుపు రంగు మయం అయిపోయింది అని చెప్పాలి.

 ఈ మ్యాచ్ లో ఘన విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ టార్గెట్ ను కాపాడుకొని భారీ పరుగులు తేడాతో విజయం సాధించి ఇక ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన రెండో జట్టుగా నిలిచింది. అదే సమయంలో ఒక అరుదైన రికార్డు కూడా సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై టీం 223/3 పరుగులు చేయగా.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు. గతంలో సన్రైజర్స్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 220/3  రన్స్ మాత్రమే ఇప్పటివరకు అత్యధిక స్కోర్ కాగా.. చెన్నై జట్టు ఇవాళ ఆ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: