ధోని ఫ్యాన్స్ కోరిక తీర్చిన.. రవీంద్ర జడేజా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ సీజన్. ఈ వార్త ఇప్పటినుంచి కాదు గత ఏడాది ఐపీఎల్ సీజన్  నుంచి కూడా వినిపిస్తూనే ఉంది. కానీ ధోని ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా ఆడుతున్నాడు. కానీ ఎందుకో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కి ముందు నుంచి మాత్రం ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ సీజన్ అంటూ గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయ్. దీంతో అభిమానుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఒకవేళ ఇదే చివరి సీజన్ అయితే మళ్ళీ ధోని ఆటను చూసే ఛాన్స్ అస్సలు రాదు. అందుకే చెన్నై అభిమానులు అందరూ కూడా ఎక్కడ మ్యాచ్ జరిగినా కూడా భారీగా స్టేడియం కు తరలివస్తున్నారు.

 దీంతో హోం గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్న జట్టు అభిమానుల కంటే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులే స్టేడియంలో ఎక్కువగా కనిపిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ధోని చివర్లో వచ్చి ఒకటి రెండు బంతులు ఆడి సిక్సర్లు కొట్టిన చాలు అనేంతలా ధోని బ్యాటింగ్ చూడటం కోసం పరితపించిపోతున్నారు అభిమానులు. కానీ కొన్ని కొన్ని మ్యాచ్లలో ధోని బ్యాటింగ్ చూసేందుకు అభిమానులకు ఛాన్సే రావడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ధోని చివరి ఓవర్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు.

 అయితే ఇక ఆరు బంతులను కూడా స్ట్రైక్ తనకే ఉంచుకొని సిక్సర్లు  కొడతాడని అనుకున్నప్పటికీ.. మొదటి బంతి సింగిల్ తీశాడు. దీంతో జడేజా స్ట్రైక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు జడేజా. దీంతో ధోనీకి స్ట్రైక్ ఇవ్వాలంటూ స్టేడియం లో ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టారు. సింగిల్ సింగిల్ అంటూ గట్టిగా అరిచారు.  ఇక ధోని ఫ్యాన్స్ కోరికను అర్థం చేసుకొని వెంటనే సింగిల్ తీసి ధోనీకి స్ట్రైక్ ఇచ్చాడు జడేజా. దీంతో జడేజా చేసిన పనికి ధోని ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఆ తర్వాత ధోని రెండు బంతుల్లో సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ అవి కుదరలేదు. దీంతో  సింగిల్స్ తోనే సరిపెట్టుకున్నాడు ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: