ట్రోల్స్ పై స్పందించిన కేఎల్ రాహుల్.. ఏమన్నాడో తెలుసా?

praveen
టీమిండియాలో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు కేఎల్ రాహుల్ . మొన్నటి వరకు రోహిత్ శర్మకు డిప్యూటీగా కూడా బాధ్యతలు నిర్వహించాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం కేఎల్ రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీని అంతటికి కారణం అతని బ్యాటింగ్ వైఫల్యమే. మొన్నటి వరకు టీం ఇండియాలో ఉన్న సమయంలో ఎన్నో మెరుపులు మెరిపించిన కేఎల్ రాహుల్ గత కొన్ని రోజుల నుంచి మాత్రం అదే రీతిలో బ్యాటింగ్ ప్రదర్శనను కొనసాగించలేకపోతున్నాడు.  మొన్నటికి మొన్న టీమిండియా తరఫున పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొన రాహుల్.. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో సైతం అదే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు.

 సాధారణంగా టి20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు ఎంతో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. ఆడిన బంతులతో పోల్చి చూస్తే అటు రన్స్ డబుల్ లేదా త్రిబుల్ ఉండాలి. కానీకేఎల్ రాహుల్ మాత్రం పరుగులు చేస్తున్న.. ఎంతో నెమ్మదిగా ఆడుతూ ఎక్కువ బంతులను తినేస్తున్నాడు. దీంతో ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఒత్తిడిలో కూరుకు పోతున్నారు అని చెప్పాలి. దీంతో ఇక కె.ఎల్ రాహుల్ టి20 ఫార్మాట్ ఆడుతున్నాడు అన్న విషయాన్ని మరిచిపోయినట్టున్నాడు అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ట్రోల్స్ పై ఇటీవల కేఎల్ రాహుల్ స్పందించాడు.

 ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ లో పాల్గొన్న కేఎల్ రాహుల్ ట్రోల్స్ గురించి మాట్లాడాడు.  తనపై వస్తున్న ట్రోల్స్.. కొన్ని కొన్ని సార్లు తనను ప్రభావితం చేస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎవరు బ్యాడ్ గా పెర్ఫార్మన్స్ ఇవ్వాలని అనుకోరు అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. నాకు క్రికెట్ తప్ప ఇంకా ఏది తెలియదు. అయితే నా ఆటపై నాకు పెద్దగా సీరియస్ నెస్ లేదని.. తగినంత కష్టపడటం లేదని ఎంతోమంది విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ నేను చాలా కష్టపడతాను కానీ అందుకు తగ్గ ఫలితం దక్కదు అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: