కోహ్లీ కెప్టెన్సీపై.. కేల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్రసింగ్ ధోని తర్వాత ఇక టీమిండియా మూడు ఫార్మాట్లకు సంబంధించిన కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ జట్టును అత్యుత్తమంగా ముందుకు నడిపించాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఎన్నో అద్వితీయమైన విజయాలను కూడా అందించాడు. అయితే కోహ్లీ కెప్టెన్సీలో ఒక్క వరల్డ్ కప్ అందించలేదు అన్న వెలితి తప్ప మిగతా అన్ని కోహ్లీ కెప్టెన్సీలో సాధించాడు అని చెప్పాలి.

 ఒకవైపు ఆటగాడిగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ప్రపంచ రికార్డులు కొల్లగొడుతూనే.. మరోవైపు కెప్టెన్ గా కూడా ఆటగాళ్లలో ఉత్తేజం నింపుతూ ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించాడు. ఇలా టీమిండియా క్రికెట్ హిస్టరీలో విరాట్ కోహ్లీ కూడా ఒక గ్రేటెస్ట్ కెప్టెన్ గా ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కోహ్లీ సారథ్యంలో కేఎల్ రాహుల్ లాంటి ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ కూడా సత్తా నిరూపించుకొని టీమిండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇకపోతే కోహ్లీ మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించగా ఇప్పుడు రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలను భుజాన వేసుకున్నాడు.

 ఇకపోతే ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి. నాయకుడిగా విరాట్ కోహ్లీ హై స్టాండర్డ్స్ సెట్ చేసాడు అంటూ కేఎల్ రాహుల్ ప్రశంసించాడు. కోహ్లీలో ఆట పట్ల ఉన్న ఇష్టం, దూకుడు ముందుండి నడిపించే స్వభావం తనకు ఎంతగానో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అతడు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తాడు. విరాట్ ఫిట్నెస్ డైట్ చూసి మేము అతని ఫాలో అయ్యాం అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం కేఎల్ రాహుల్ గాయం కారణంగా టీమిండియా ఆడబోయే కీలకమైన డబ్ల్యూటీసి ఫైనల్కు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: