ఓటమిపై.. రోహిత్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఐపీఎల్ హిస్టరీ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. అతి తక్కువ సమయం లోనే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకు పోయిన టీం గా ఉంది. ఇప్పటి వరకు ఇక టైటిల్స్ గెలవడం విషయం లో ఒక చెన్నై సూపర్ కింగ్స్ (4 టైటిల్స్) మినహా ఏ జట్టు నుంచి కూడా పోటీ లేదు అని చెప్పాలి. అయితే అలాంటి ఛాంపియన్ జట్టు గత ఏడాది ఐపిఎల్ సీజన్ నుంచి కూడా పేలవమైన  ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది.

 ఎప్పుడు ప్రత్యర్థుల  పై ఆదిపత్యం చెలాయిస్తూ అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకునే ముంబై ఇండియన్స్.. ఇప్పుడు మాత్రం పడుతూ లేస్తూ ప్రయాణాన్ని సాగిస్తుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక్క విజయం తో అటు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది ముంబై ఇండియన్స్. దీంతో ఇక ముంబై ప్లే ఆఫ్ లో అడుగు పెడుతుంది అని అభిమానులు అందరిలో కూడా కొత్త ఊపిరి నిండి పోయింది. అయితే నెట్ రన్ రేట్ మైనస్ లో ఉన్న ముంబై ఇక తర్వాత జరిగిన రెండు మ్యాచ్లు కూడా గెలవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో లక్నోతో జరిగిన మ్యాచ్లో మాత్రం ముంబై ఇండియన్స్ ఓడిపోయింది అని చెప్పాలి.

 ఎంతో సులభంగా గెలుస్తుంది అనుకున్న ముంబై ఇండియన్స్ ఓడిపోవడం అటు అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఓటమిపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ దులదృష్టవశాత్తు ఓడిపోయాం. విజయం సాధించే దిశగా ఆడలేకపోయాం.. బ్యాటింగ్ సమయంలో కాస్త తడబాటుకు గురయ్యాం.. లక్నోకి చివరి మూడు ఓవర్లలో అదనంగా పరుగులు ఇవ్వడం కూడా జట్టుకు నష్టం చేసింది. కానీ ఆ తర్వాత సన్రైజర్స్ తో జరగబోయే మ్యాచ్ లో మాత్రం తప్పక గెలుస్తాం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: