సౌరబ్ గంగూలీని కోచ్ గా పెట్టుకోండి : ఇర్ఫాన్ పఠాన్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత కొంతకాలం నుంచి ప్రతిసీజన్లో కూడా మంచి ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. టైటిల్ గెలవకపోయినా ఇక అటు క్రికెట్ లో మాత్రం అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంది ఈ టీం. అయితే కొన్నాళ్ల వరకు ఢిల్లీ జట్టు మంచి ప్రదర్శన చేస్తుంది అని సంతృప్తి చెందిన అభిమానులు.. ఆ తర్వాత మాత్రం ఢిల్లీ జట్టు టైటిల్ గెలిస్తే బాగుండు అని కోరుకోవడం మొదలుపెట్టారు. కానీ ఢిల్లీ జట్టుకు టైటిల్ గెలవడం అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది.

 శ్రేయస్ అయ్యర్ ఒకప్పుడు ఢిల్లీ జట్టు కెప్టెన్ గా ఉండేవాడు. అతనికి కెప్టెన్సీలో కూడా ఢిల్లీ జట్టు బాగానే ఆడింది. అయితే ఆ తర్వాత ఢిల్లీ యాజమాన్యం కెప్టెన్ గా రిషబ్ పంతును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అతను కూడా కెప్టెన్సీలో పరవాలేదు అనిపించాడు. కానీ ఇటీవల అతనికి గాయం కావడంతో డేవిడ్ వార్నర్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది ఆ జట్టు యాజమాన్యం  అయితే కెప్టెన్సీలో అనుభవం ఉన్న వార్నర్ మాత్రం జట్టును సమర్ధవంతంగా నడిపించడంలో విఫలమయ్యాడు. 2023 ఏడాదిలో ఢిల్లీ జట్టు పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగించి ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది.

 దీంతో ఢిల్లీ జట్టు ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో నిరాశ పరిచిన ఢిల్లీ జట్టుకు కోచ్ ను మార్చాలి అంటూ అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్ల సైకాలజీ దాదాపు సౌరబ్ గంగూలీకి బాగా తెలుసని.. ఢిల్లీ డగౌట్లో ఆయన ఉండడం సానుకూల అంశమని చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. అందుకే వచ్చే సీజన్ నుంచి రికీ పాంటింగ్ స్థానంలో సౌరవ్ గంగూలికి  కోచ్ బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డాడు. కాగ ప్రస్తుతం సౌరబ్ గంగూలీ ఢిల్లీ జట్టు క్రికెట్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. ఇకపోతే ఈ సీజన్లో ఢిల్లీ 13 మ్యాచ్లలో ఐదు మ్యాచ్లు మాత్రమే గెలిచి ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: