అతన్ని డబ్ల్యూటీసి ఫైనల్ కు.. ఎంపిక చేసుంటే బాగుండేది : ఆకాష్ చోప్రా

praveen
2023 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్థానం ముగిసింది. ఇటీవల జరిగిన గుజరాత్ తో మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది సన్ రైజర్స్ జట్టు. అయితే ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరూ కూడా ఇప్పుడు వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ జట్టు మొత్తం విఫలమవుతున్న సమయంలో మాత్రం అతను మాత్రం అత్యుత్తమమైన గణాంకాలు నమోదు చేస్తూ జట్టుకు విజయాన్ని అందించేందుకు అన్ని విధాలుగా  ప్రయత్నించాడు. అతను ఎవరో కాదు భువనేశ్వర్ కుమార్.

 ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర ఓటమిని చవి చూసినప్పటికీ.. అటు ఆ జట్టులో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఐదు వికెట్లు సాధించి అదరగొట్టాడు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి సీనియర్ బౌలర్ అనే ముద్ర పడటంతో టీమిండియాలో అతనికి సరైన అవకాశాలు లభించడం లేదు. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో రాణించడం ద్వారా మళ్లీ టీం ఇండియాలోకి రావాలని అతను ఆశపడుతున్నాడు. ఇక ఇటీవల ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను ఎంపిక చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు ఆకాష్ చోప్రా. ఇటీవల ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ 5 వికెట్లు పడగొట్టి మంచి ప్రదర్శన చేయగా.. ఆకాష్ చోప్రా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. భువనేశ్వర్ కుమార్ బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. అందుకే అతన్ని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి తీసుకొని ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు అది కుదరకపోవచ్చు అంటూ ఆకాష్ చోప్రా కామెంట్ చేశాడు. కాగా జూన్ నెలలో అటు లండన్ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: