నాకు ఇష్టమైన వంటకాలు దొరకట్లేదు.. షమి కామెంట్?

praveen
టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి.. ఇక ఇప్పుడు సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్లో యువ బౌలర్ల హవా పెరిగిపోతున్న కూడా సీనియర్ బౌలర్ షమీ ఎప్పటికప్పుడు తన ప్రతిభను కొత్తగా నిరూపించుకుంటూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీల తరఫున ప్రాతినిధ్యం వహించిన షమీ ప్రస్తుతం డిపెండింగ్  ఛాంపియన్స్ గా పేరు సంపాదించుకున్న గుజరాత్ తరపున ఆడుతున్నాడు.

ఇక ప్రస్తుతం గుజరాత్ జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతూ ప్రతి మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహిస్తున్నాడు అని చెప్పాలి. అయితే గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం సీనియర్ బౌలర్ షమీపై పూర్తి నమ్మకాన్ని ఉంచి.. తుది జట్టులో వరుసగా చాన్సులు ఇస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఇటీవలే గుజరాత్ జట్టు సన్రైజర్స్ పై ఘనవిజయాన్ని సాధించడం ద్వారా  పాయింట్ల పట్టికలో  తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవడమే కాదు ప్లే ఆఫ్ కి అర్హత కూడా సాధించింది. ఇదిలా ఉంటే ఇటీవల షమి గుజరాత్ ఫుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 తనకు ఇష్టమైన వంటకాలు ప్రస్తుతం దొరక్కపోయినప్పటికీ.. గుజరాత్ ఫుడ్ ని మాత్రం ఎంతగానో ఆస్వాదిస్తున్నాను అంటూ ఆ జట్టు బౌలర్ మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు వ్యాఖ్యాత రవి శాస్త్రి అడిగిన ప్రశ్నకు ఇక మహమ్మద్ షమి ఇలాంటి బదులు ఇచ్చాడు. ఇక అదే సమయంలో తన సహచర బౌలర్ అయిన మోహిత్ శర్మపై కూడా షమీ ప్రశంసల వర్షం కురిపించాడు అని చెప్పాలి. మోహిత్ శర్మలాంటి ఫేసర్ జట్టులో ఉండడం ఎంతో కలిసి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇప్పుడు వరకు 13 మ్యాచ్లలో కలిపి 23 వికెట్లను పడగొట్టి అదరగొట్టాడు  మహమ్మద్ షమీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: