రింకు సింగ్ విధ్వంసానికి బలై.. రీ ఎంట్రీలో మాత్రం అదరగొట్టాడు?
అయితే ఇక గుజరాత్ టైటాన్స్ మెరుపులు కేవలం ఒక్క సీజన్‌కే పరిమితం అని.. ఏదో అదృష్టవశాత్తు టైటిల్ విజేతగా నిలిచారు అని కొంతమంది విమర్శలు కూడా చేశారు. కానీ ఇక మొదటి సీజన్ జోరునే ఇప్పుడు రెండో సీజన్లోనూ కొనసాగిస్తుంది గుజరాత్. మిగతా ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో విన్నింగ్ పర్సంటేజ్ కొనసాగిస్తూ ఎప్పుడు పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతూ వస్తోంది. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన గుజరాత్ జట్టు 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది.
అయితే ఇలా గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగుతూ ఉన్నాడు యష్ దయాల్. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో రింకు సింగ్ యష్ దయాల్ బౌలింగ్‌లో 5 సిక్సర్లు బాది ఇక అద్వితీయమైన ఇన్నింగ్స్ తో కోల్‌కతా జట్టును విజయం సాధించాడు. అయితే రింకు సింగ్ ఇన్నింగ్స్ తర్వాత బెంగతో యష్ దయాల్‌కి జ్వరం వచ్చిందని.. నాలుగు కిలోల బరువు కూడా తగ్గాడు అంటూ గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే దాదాపు 9 మ్యాచ్ ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన యష్ దయాల్ తొలి ఓవర్ లోనే వికెట్ పడగొట్టి అదరగొట్టాడు. ఇటీవల సన్‌రైజర్స్ తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మను అవుట్ చేశాడు.