అమిత్ మిశ్రా.. వెంటనే నన్ను కలువు : సెహ్వాగ్

praveen
కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న కొంతమంది సీనియర్ క్రికెటర్లు.. ఇక 2023 ఐపీఎల్ సీజన్లో ఛాన్స్ దక్కించుకుంటున్నారు. వచ్చిన ఛాన్స్ ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా ఐపీఎల్ లో ఛాన్స్ దక్కించుకుని అదరగొడుతున్న వారిలో వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఒకరు అని చెప్పాలి. ప్రస్తుతం 45 ఏళ్లు వచ్చినా కూడా ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. యువ స్పిన్నర్లకు సైతం సాధ్యం కాని రీతిలో గణాంకాలను నమోదు చేస్తూ అదరగొడుతూ ఉన్నాడు. 7.47 ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను  కట్టడి చేస్తున్నాడు.

 అయితే లక్నో జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ మిశ్రా ఫిట్నెస్ సమస్యల కారణంగా అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు అని చెప్పాలి. దీంతో ఇక అమిత్ మీశ్రా లాంటి కీలక స్పిన్నర్ లేకుండా కొన్ని మ్యాచ్లలో లక్నో ఇబ్బంది పడటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమిత్ మిశ్రా  ప్రతిభా ఎక్కడికి పోలేదు. అయితే వయసు పెరిగే కొద్దీ మునుపటి వేగం మాత్రం ఎవరిలో అయినా తగ్గటం సహజం అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

 ఎవరైనా బ్యాట్స్మెన్ త్వరగా రిటైర్మెంట్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఫిట్నెస్ సమస్య. 20 ఓవర్ల పాటు మైదానంలో ఫీల్డింగ్  చేయాలంటే ఎంతో ఫిట్ గా ఉండాలి. ఒకవేళ సునీల్ గవాస్కర్ ను బ్యాటింగ్ ను పంపిన ప్రస్తుతం కొన్ని షాట్లు ఆడగలడు. కానీ వికెట్ల మధ్య పరిగెత్తడం ఫీల్డింగ్  చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇందుకోసం ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఫిట్నెస్ ఉంటేనే క్రికెటర్లు తమ కెరీర్ ను పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ధోని చేసి చూపించాడు. అమిత్ మిశ్రా కూడా ఇలాగే ఫిట్నెస్ కాపాడుకొని మరో ఎడారి పాటు ఆడాలి. అమిత్ మిశ్రా నువ్వు ఫిట్నెస్పై దృష్టి పెట్టు.. అలా చేయలేనప్పుడు వెంటనే కలువు తప్పకుండా సహాయం చేస్తా అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: